NTV Telugu Site icon

Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్‌లో రితికా ఓటమి.. కాంస్యం మీదే ఆశలు

Rithika

Rithika

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మహిళల 76 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో శనివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో రీతికా హుడా ఓటమి పాలైంది. 1-1తో కిర్గిస్థాన్‌కు చెందిన టాప్-సీడ్ ఐపెరి మెడెట్ కైజీ చేతిలో ఓడిపోయింది. కైజీ ఫైనల్‌కు చేరితే.. రిపీచేజ్ రౌండ్‌లో రీతికా కాంస్య పతకాన్ని సాధించే అవకాశం ఉంది. అంతకుముందు రీతికా 12-2 టెక్నికల్ ఆధిక్యతతో హంగరీకి చెందిన బెర్నాడెట్ నాగిపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ క్రమంలో.. ఓటమి పాలవ్వడంతో కాంస్య పతకం పైనే ఆశలు ఉన్నాయి.

Narne Nithin: ‘ఆయ్’ అందుకే అనుకున్నాం.. ట్రైలర్ ఎన్టీఆర్‌కి బాగా న‌చ్చింది : నార్నే నితిన్‌ ఇంటర్వ్యూ

క్వార్టర్ ఫైనల్‌లో కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన ఐపెరి మెటెట్‌తో మొదట డ్రా అయింది. ఆ తర్వాత రితికా చివరి పాయింట్‌ను కోల్పోయింది. ప్రారంభంలో ఒక పాయింట్ ఆధిక్యాన్ని పొందగలిగిన రితికా.. రెండో భాగంలో గట్టిపోటీ ఇచ్చింది. మ్యాచ్‌కి చివరి పాయింట్‌గా రుజువైన ‘పాసివిటీ (ఓవర్‌ డిఫెన్సివ్‌ యాటిట్యూడ్‌)’ కారణంగా రితికా పాయింట్‌ కోల్పోయింది. 21 ఏళ్ల రితికా మొదటిసారి ఒలింపిక్స్లో ఆడుతుంది. ఈ వెయిట్ కేటగిరీలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత దేశానికి చెందిన తొలి రెజ్లర్‌గా రితిక రికార్డులకెక్కింది. కాగా.. ఈ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ నిబంధనలు భారత్ స్వర్ణ పతక ఆశలకు పెద్ద దెబ్బ తీశాయి. రితికా కంటే ముందు వినేష్ ఫోగట్ కూడా పతకం సాధించలేకపోయింది. ఆమె బరువు కేవలం 100 గ్రాములు ఎక్కువ ఉన్న కారణం వల్ల ఫైనల్ ఆడలేకపోయింది. నిబంధనల ఆధారంగా ఆమెను అనర్హులుగా ప్రకటించారు.

AP CM Chandrababu: ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన టీటీడీపీ నేతల భేటీ..

రితికా రోహ్‌తక్‌లోని ఖడ్కడ గ్రామంలో భారతీయ నావికాదళానికి చెందిన అధికారి. ఆమె ఇండియన్ నేవీలో అధికారి, చీఫ్ పీటీ ఆఫీసర్‌గా పనిచేసింది. 2022లో జరిగిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో 72 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆ తరువాత.. టిరానాలో 2023లో జరిగిన అండర్-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. 2024లోనే ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 72 కేజీల విభాగంలో రితికా కాంస్య పతకం సాధించింది.