NTV Telugu Site icon

Paris Olympics 2024: సెమీస్‌కి చేరిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్..

Aman Sehrawat

Aman Sehrawat

2024 పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్‌లో భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు.అల్బేనియాకు చెందిన జెలిమ్‌ఖాన్ అబాకరోవ్‌పై సెహ్రావత్ 12-0తో విజయం సాధించాడు. తన ప్రత్యర్థికి పోరాటాన్ని ప్రారంభించడానికి ఏ మాత్రం సమయం ఇవ్వలేదు. 2024 పారిస్ గేమ్స్‌లో భారతదేశపు పురుష రెజ్లరలో అమన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కాగా.. సెమీ ఫైనల్ మ్యాచ్ ఈరోజు రాత్రి 9.45 గంటలకు జరగనుంది.

Double ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ట్రిపుల్ ఇస్మార్ట్?

మరోవైపు.. క్వార్టర్‌ఫైనల్‌లో జపాన్‌కు చెందిన టాప్ సీడ్ రీ హిగుచితో తలపడనున్నాడు. కాగా.. ఈ ఈవెంట్‌లో భారత్‌కు పతకం సాధించేందుకు అమన్‌ ఒక్క విజయం దూరంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. అంతకుముందు, మహిళల 57 కేజీల ఈవెంట్‌లో భారత్‌కు చెందిన అన్షు మాలిక్ తన రౌండ్ ఆఫ్ 16 బౌట్‌లో అమెరికాకు చెందిన హెలెన్ లూయిస్ మరౌలిస్ చేతిలో ఓడిపోయింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేతతో జరిగిన మ్యాచ్‌లో ఆమె 7-2 తేడాతో ఓడిపోయింది.

Show comments