Site icon NTV Telugu

Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్‌కు భారత మహిళల ఆర్చరీ జట్టు..

Archary

Archary

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళల ఆర్చరీ జట్టు శుభారంభాన్ని అందించింది. దీంతో.. క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భ‌జ‌న కౌర్‌, దీపిక కుమారిల‌తో పాటు అంకిత భ‌క‌త్ అద్భుత ప్రద‌ర్శన చేయ‌డంతో భార‌త్ టాప్‌-4లో నిలిచింది. ఈ ముగ్గురు ఆర్చర్లు క‌లిసి 1983 పాయింట్లు సాధించారు. అంకిత భ‌క‌త్ (666) పాయింట్లు చేసింది. భజన్ కౌర్ (659), దీపికా కుమారి (658) పాయింట్లు సాధించింది. వ్యక్తిగ‌త విభాగంలో అంకిత తృటిలో టాప్‌-10లో చోటు ద‌క్కించుకోలేక‌పోయింది.

Read Also: Africa: ఆఫ్రికాలో బోటు బోల్తా.. 15 మంది మృతి.. డజన్ల కొద్దీ గల్లంతు

మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్‌లో భారత్ గెలిస్తే.. సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియాతో తలపడవచ్చు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్స్‌తో ఢీకొనే అవకాశం ఉంది. అయితే అసలు పోరు మాత్రం సెమీ ఫైనల్‌లోనే జరగనుంది. ఒకవేళ భారత జట్టు సెమీఫైనల్‌కు చేరితే దక్షిణ కొరియాతో తలపడనుంది. దక్షిణ కొరియా ఒలింపిక్ చరిత్రలో ఆర్చరీలో 27 బంగారు పతకాలు సాధించింది. ఇతర దేశాల కంటే 13 ఎక్కువ. మూడేళ్ల క్రితం టోక్యోలో వరుసగా తొమ్మిదో పతకాన్ని సాధించిన కొరియా జట్టు ఒలింపిక్స్‌లో అజేయంగా నిలిచింది.

Read Also: Vishnu Kumar Raju: 95 శాతం ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు.. అక్రమ కేసులపై హోంమంత్రి సమీక్ష చేయాలి..

టీమ్ ర్యాంకింగ్స్‌లో 1983 పాయింట్లతో భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా 2046 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా రన్నరప్‌గా నిలవగా, మెక్సికో మూడో స్థానంలో నిలిచింది. టీమ్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధిస్తుండగా.. ఐదు నుంచి 12వ ర్యాంక్‌లో ఉన్న జట్లు రౌండ్ ఆఫ్ 16లో ఆడతాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో భారత్ క్వార్టర్స్‌లో తలపడనుంది.

Exit mobile version