Site icon NTV Telugu

Guinness Record: పళ్లతో గిన్నీస్ రికార్డు సాధించిన భారతీయ మహిళ

Teeth

Teeth

ఓ మహిళ తన నోటిలో ఉండే పళ్లతో గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించింది. మాములుగా అయితే మన నోటిలో 32 పళ్లు ఉంటాయి. కానీ ఈ మహిళకు 38 పళ్లు ఉన్నాయి. దీంతో కల్పనా బాలన్ అనే ఇండియాకు చెందిన 26 ఏళ్ల మహిళ గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. ఆమే దిగువ దవడపై నాలుగు అదనపు దంతాలు.. దవడ పై వరుసలో రెండు అదనపు పళ్లు వచ్చాయి.

Father Killed Son: ఢిల్లీలో దారుణం.. భార్యతో గొడవ.. ఇద్దరు కొడుకుల గొంతు కోసిన తండ్రి.. ఆపై

కల్పనా బాలన్, యుక్త వయస్సులో ఉన్నప్పుడు సూపర్‌ జ్ఞాన దంతాలు అదనంగా పెరిగాయి. అయితే మొదట్లో ఆమె వాటిని తీసేయాలని భావించింది. ఈ క్రమంలోనే దంత వైద్యులను సంప్రదించారు. తర్వాత వాటిని తీసేయొద్దని నిర్ణయించుకున్నట్లు బాలన్ తెలిపారు. సదరు అదనపు దంతాలు తన ఆరోగ్యానికి ఎటువంటి కష్టం కలిగించనందున, పైగా నోట్లో నొప్పిని కలిగించవు కాబట్టి వాటిని తొలగించలేదని ఆమే తెలిపారు.

Ghol fish: గుజరాత్ రాష్ట్ర చేపగా ‘ఘోల్ ఫిష్’.. దీన్ని కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..

ఇవే కాక ఆమెకు మరో రెండు దంతాలు రానున్నాయని, భవిష్యత్ లో మరో రికార్డు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు దంత వైద్యులు నిర్ధారించారన్నారు. ఇదిలా ఉంటే.. పురుషుల విభాగంలో ఈ రికార్డు కెనడాకు చెందిన ఇవానో మలోన్ పేరిట ఉంది. అతనికి మొత్తం 41 దంతాలు ఉన్నాయి. ప్రస్తుతం కల్పన గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఆమే ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version