Site icon NTV Telugu

India- China Conflict: దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకల ఎంట్రీ..!

India China

India China

India- China Tension: దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విధుల నిర్వహణలో భాగంగా భారతదేశపు నౌకాదళానికి చెందిన మూడు యుద్ధ నౌకలు సింగపూర్‌ కు చేరుకున్నాయి. రెండు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న బలమైన బంధానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ దురుసు చర్యలకు పాల్పడుతుండటంతో భారత యుద్ధ నౌకల మోహరింపునకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్‌ ఢిల్లీ, శక్తి, కిల్టాన్‌ యుద్ధనౌకలు సోమవారం నాడు సింగపూర్‌ చేరుకున్నాయని నౌకాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు.

Read Also: Maldives- India Tension: రేపు భారత్కు మాల్దీవుల విదేశాంగ మంత్రి.. ఎందుకో తెలుసా..?

ఇక, మూడు రోజుల పాటు ఈ వార్‌షిప్‌లు ఇక్కడే ఉండనున్నాయని నౌకాదళ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఆ తర్వాత ఈ యుద్ధనౌకలు మలేసియాకు.. ఆ తర్వాత ఫిలిప్పీన్స్‌కు బయలుదేరి వెళ్లనున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్‌ యుద్ధ నౌకలతో డ్రాగన్ కంట్రీ చైనాకు సైనిక ప్రతిష్టంభన ఏర్పడింది. దక్షిణ చైనా సముద్రం పూర్తిగా తనదేనని చైనా వాదిస్తుంది. దీన్ని ఫిలిప్పీన్స్‌, మలేసియా, బ్రునై, తైవాన్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సముంద్రంలో తమ హక్కులను చాటుకునేందుకు ఫిలిప్పీన్స్‌.. అమెరికా మద్దతుతో గస్తీ కాస్తుంది. ఆ సమయంలో చైనా నౌకాదళంతో తీవ్ర ఉద్రిక్తతలు వస్తున్నాయి.

Exit mobile version