NTV Telugu Site icon

Family In Guinness World Records: ఆ కుటుంబం మొత్తానికి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో స్థానం

Guinness World Records

Guinness World Records

Family In Guinness World Records: చైనా దేశంలో చాంగ్షా నగరంలో నివసించే ఒక భారతీయ తెలుగు కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు గినిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయ్యాయి. ఇలా రికార్డ్ సాధించడం ప్రపంచంలోని ఎకైక కుటుంబం. కుటుంబంలో ప్రతి వ్యక్తి దగ్గర తన స్వంత వరల్డ్ రికార్డు ఉంది. ఈ కుటుంబం రికార్డులను యోగ, క్రీడా రంగాల్లో సాధించింది. విజయ్, అతని భార్య కోనతాల జ్యోతీ యోగలో అద్భుతమైన రికార్డు సాధించారు. గర్భావస్థలో 9వ నెలలో ఉన్నప్పుడు ఆమె కఠినమైన యోగాసనాలు చేసి గినిస్ వరల్డ్ రికార్డ్స్‌ను సాధించారు. ఆమె డెలివరీకి ఐదు రోజుల ముందు ఈ రికార్డు సాధించారు. యోగను సరైన విధంగా చేస్తే అది గర్భావస్థలో ప్రమాదకరం కాదు. తల్లి, బిడ్డకు ఎంతో ఉపకారకమైనదిగా ఉంటుందని ఆవిడ తెలిపారు. అంతేకాకుండా, జ్యోతీ అత్యధిక సమయం పాటు యోగ సాధన చేసే రికార్డును కూడా సాధించారు.

Also Read: Bomb Threat: ఎగ్జామ్స్ వాయిదా వేసేందుకు స్కూల్కి స్టూడెంట్స్ బాంబు బెదిరింపులు..

మా కుటుంబం యోగాను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందేందుకు పని చేస్తోందని, మా కుటుంబం చేసినది భారతదేశం కోసం అని విజయ్ చెప్పారు. యోగ మన సంస్కృతికి చెందినది. దీన్ని ప్రపంచంలో ఎక్కడో ఎక్కడా పంచాలని మా లక్ష్యం అని అన్నారు. విజయ్ ఈకాగా, తమ కుటుంబం తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి నుంచి ప్రేరణ పొందిందని తెలిపారు. చిరంజీవి వారిని వారి ఇంటికి ఆహ్వానించి గౌరవించి, మద్దతు ఇచ్చారని చెప్పారు. విజయ్, తమ కుటుంబం ద్వారా సాధించిన ఈ రికార్డులను ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం చేసారు. ప్రధాని మోదీ ఇంటర్నేషనల్ యోగ డే కార్యక్రమం ద్వారా లక్షల మందికి ప్రేరణ ఇచ్చారు. తాము ఆయనను కలవాలని, మా ప్రయాణం గురించి ఆయనతో పంచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అది మా కుటుంబం కోసం గొప్ప గర్వకరమైన క్షణం అవుతుందని విజయ్ చెప్పుకొచ్చారు.