NTV Telugu Site icon

Team India: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కి భారత జట్టు ఎంపిక.. తెలుగు కుర్రాళ్లకు చోటు

Team India

Team India

ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కి భారత జట్టు ఎంపిక చేసింది. జనవరి 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ నుంచి షమీ భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు.. టీ20 జట్టు నుంచి రిషబ్ పంత్‌ను తప్పించారు. అలాగే… ఈ జట్టులో తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి చోటు దక్కించుకున్నారు.

Read Also: Sankranti Celebrations: విజయవాడ ఏ.ఆర్. పోలీసు గ్రౌండ్‌లో సంక్రాంతి సంబరాలు..

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ , వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).

జనవరి 22 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ జనవరి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో జరగనుంది. రెండో మ్యాచ్ జనవరి 25న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. సిరీస్‌లోని మూడో మ్యాచ్ జనవరి 28న రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. జనవరి 31న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నాలుగో టీ20, ఫిబ్రవరి 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐదో టీ20 జరగనుంది. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.

IND vs ENG T20 సిరీస్ షెడ్యూల్:
తొలి టీ20: జనవరి 22 – ఈడెన్ గార్డెన్, కోల్‌కతా
రెండవ T20: 25 జనవరి – MA చిదంబరం స్టేడియం, చెన్నై
మూడో టీ20: జనవరి 28 – సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్
నాల్గవ T20: 31 జనవరి – మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణె
ఐదో టీ20: ఫిబ్రవరి 2- వాంఖడే స్టేడియం, ముంబై

Show comments