అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు తీవ్ర కలవరం రేపుతున్నాయి. ఈ ఏడాదిలోనే పలువురు హత్యకు గురయ్యారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి కిడ్నాప్ అయి.. అనంతరం హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలు మరువక ముందే తెలంగాణకు చెందిన మరొక విద్యార్థి మిస్సింగ్ భయాందోళనకు గురి చేస్తోంది. మే 2 నుంచి రూపేష్ చంద్ర అనే విద్యార్థి ఆచూకీ లభించడం లేదు. చికాగోలో ఇతడు అదృశ్యమయ్యాడు. ఈ మేరకు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాను సంప్రదిస్తున్నట్లు రూపేష్ చంద్ర తండ్రి సదానందం తెలిపారు. అలాగే ఎన్నారైలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Uttarpradesh : 29ఏళ్ల నాటి కేసు.. 100వారెంట్ల తర్వాత కూడా హాజరుకాని ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్
తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేష్ చంద్రతో అతని తండ్రి సదానందం మే 2న మధ్యాహ్నం కొడుకుతో వాట్సప్ కాల్ మాట్లాడారు. ఆయా విషయాలు మాట్లాడుకున్నారు. అనంతరం అతని ఫోన్ స్విచ్ఛాప్‌లోకి వెళ్లిపోయిందని సదానందం తెలిపారు. కుటుంబ సభ్యులు అతని రూమ్మేట్స్‌తో మాట్లాడారు. ఎవర్నో కలవడానికి వెళ్లాడని బదులిచ్చారు. వారు ఎవరో తమకు తెలియదని సమాధానం వచ్చింది. రూపేప్ చంద్ర అదృశ్యమైనట్లు చికాగో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. అలాగే అమెరికా ఎంబసీని కూడా సంప్రదించినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: BJP MLAs: ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ పై కేసు నమోదు.. కారణం ఇదీ..
ఇదిలా ఉంటే తమ కుమారుడి ఆచూకీ తెలుసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సదానందం లేఖ ద్వారా సహాయం కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం.. చికాగో ఎంబసీకి సమాచారం చేరవేసింది. రూపేష్ చంద్ర ఆచూకీ కనుక్కోవాలని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్‌ను కిడ్నాపర్లు ఎత్తుకెళ్లి డబ్బు డిమాండ్ చేశారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించారు. కానీ కొద్దిరోజులకే అతడు శవమై కనిపించాడు. ఇలా అగ్రరాజ్యంలో వరుస మరణాలు చోటుచేసుకుంటున్నాయి.
