Site icon NTV Telugu

Arukonda Rajesh : అమెరికాలో భారత విద్యార్థి మృతి

Arukonda Rajesh

Arukonda Rajesh

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లాకు చెందిన రాజేష్‌.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ మృతి చెందాడు. దీంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజేష్ బంధువులు అతడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. 2015లో ఎమ్మెస్ ట్రైనింగ్ చేసేందుకు వెళ్లిన రాజేష్.. మూడు రోజుల క్రితం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు అతని స్నేహితులు సమాచారం ఇచ్చారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, రాజేష్‌ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, రాజేష్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వానికి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. కన్నీరు పెట్టుకుంటూ కుమారుడి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక, తొమ్మిది నెలల క్రితమే రాజేష్‌ తండ్రి మృతిచెందినట్లు తెలుస్తోంది.

Kolkata Doctor case: వెలుగులోకి సందీప్ ఘోష్ క్రూరత్వం.. బాలింత భార్యను కడుపుపై తన్నిన మాజీ ప్రిన్సిపాల్

Exit mobile version