Himanshu Kulkarni: భారతదేశ శాస్త్రవేత్త చరిత్ర సృష్టించారు. నిజంగా ఇదో చారిత్రాత్మక మైలురాయి. పూణేకు చెందిన జలవనరుల నిపుణుడు డాక్టర్ హిమాన్షు కులకర్ణి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జల బహుమతిని గెలుచుకున్నారు. ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయ శాస్త్రవేత్తగా ఆయన రికార్డు సృష్టించారు. ఆయన USA ఒక్లహోమా విశ్వవిద్యాలయం WATERCenter ఆధ్వర్యంలో అందజేస్తున్న ఈ అవార్డును అందుకున్నారు. ఈ సంస్థను 2009లో స్థాపించారు. భారతదేశం తరుఫున 16 ఏళ్ల తర్వాత మొట్ట మొదటి సారి ఆయన ఈ అవార్డ్ గెలుచుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరు, ఆయన కథ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Tollywood: అమీతుమీ తేల్చుకునేందుకు పోటీపడుతున్న హీరోలు
ఆయన ఎవరు..
చాలా కాలంగా భూగర్భ జల నిర్వహణ, సంబంధిత విభాగాలపై డాక్టర్ హిమాన్షు కులకర్ణి పనిచేశారు. ఆయన నీతి ఆయోగ్ 12వ ప్రణాళిక వర్కింగ్ గ్రూప్‌కు సహ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. అలాగే జాతీయ జలాశయ మ్యాపింగ్ ప్రోగ్రామ్ ముసాయిదా రూపకల్పనకు కృషి చేశారు. ఆయన ప్రస్తుతం శివ్ నాదర్ విశ్వవిద్యాలయంలో గ్రామీణ నిర్వహణలో ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా, ఐఐటీ బాంబే, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేస్తు్న్నారు. భారతదేశంలో భూగర్భ జలాల సంక్షోభాన్ని సమాజ భాగస్వామ్యం, భాగస్వామ్య వనరుల నిర్వహణ ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చని డాక్టర్ హిమాన్షు కులకర్ణి విశ్వసిస్తున్నారు. ఈక్రమంలో ఆయన ACWADAM (అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్) ద్వారా అనేక ప్రాంతాలలో స్థానిక సమాజాలను నీటి నిర్వహణలో భాగస్వాములను చేశారు. ఆయన మాట్లాడుతూ.. భూగర్భ జలాలను ఒక సాధారణ వనరుగా నిర్వహించడం ద్వారా మాత్రమే నీటి సంక్షోభాన్ని పరిష్కరించవచ్చని చెబుతున్నారు.
ఈ బహుమతి స్పెషల్ ఏంటి..
ఈ అవార్డును ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ప్రదానం చేస్తారు. పరిశోధన, విద్య లేదా సామాజిక సేవ ద్వారా నీటి నిర్వహణకు దోహదపడే శాస్త్రవేత్తలను దీనితో సత్కరిస్తారు. ఈ బహుమతిని ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పేద వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తారు. ఈ అవార్డ్‌ను డాక్టర్ హిమాన్షు కులకర్ణికి 2024 సంవత్సరానికి గాను ప్రకటించారు. ఈక్రమంలో సెప్టెంబర్ 15, 2025న జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ఆయనకు అవార్డును అందజేశారు. బహుమతిలో ట్రోఫీ, US$25,000 నగదు బహుమతిని ఆయనకు అందజేశారు.
READ ALSO: Kurnool Supari Murder: దాయాదుల దారుణం.. సుపారి ఇచ్చి మరీ హత్య
