NTV Telugu Site icon

Vandhe Bharat : వందే భారత్‌లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు ఖాళీ కడుపుతో ఉండాల్సిన అవసరం లేదు

Vandebharatexpresstrains

Vandebharatexpresstrains

Vandhe Bharat : ప్రధాని మోదీ కలల ప్రాజెక్ట్ వందేభారత్ రోజురోజుకు ఆదరణ పెంచుకుంటుంది. దేశ వ్యాప్తంగా వందే భారత్ సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఎప్పటి కప్పుడు పలు రూట్లలో కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతుంది. ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లలో ఓ లోపం ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తుంది. తాజాగా ప్రభుత్వం వందే భారత్ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు పెద్ద బహుమతిని అందించింది. రైల్వే ప్రయాణికుల కోసం కీలక ప్రకటన చేసింది. ఇకపై వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులు బుకింగ్ సమయంలో ఫుడ్ ఆఫ్షన్ ను ఎంచుకోకపోయినా ప్రయాణ సమయంలో రైలులో ఆహారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. వారు ఖాళీ కడుపుతో ప్రయాణించాల్సిన అవసరం ఉండదు.

Read Also:PM Modi: ఢిల్లీ ప్రజలకు విముక్తి లభించింది

వందే భారత్ రైలు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఫుడ్ ఆఫ్షన్ ఎంచుకోకపోయినా.. ప్రయాణ సమయంలో ఆహారం కొనుగోలు చేయవచ్చని రైల్వే బోర్డు తెలిపింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఈ మేరకు ఓ లేఖ జారీ చేసింది. వందే భారత్‌లో ప్రయాణీకులు టికెట్ సమయంలో ఫుడ్ ఆఫ్షన్ ఎంచుకోకపోయినా ప్రయాణ సమయంలో వారికి ఆహార సౌకర్యం కల్పించవచ్చని లేఖలో పేర్కొన్నారు.

Read Also:BRS: బీసీల రిజర్వేషన్ల అంశంపై సీఎస్‌కు బీఆర్ఎస్ వినతిపత్రం..

బుకింగ్ సమయంలో ఫుడ్ ఆఫ్షన్ ను ఎంచుకోకపోయినా వండిన ఆహారం అందుబాటులో ఉంటే దానిని ప్రయాణీకులకు అందించవచ్చని పేర్కొన్నారు. చాలాసార్లు మీరు బుకింగ్ చేసేటప్పుడు ప్రీపెయిడ్ ఫుడ్‌ను ఎంచుకోరని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. దీని అర్థం మీరు బుకింగ్‌తో ఆహారాన్ని ఎంచుకోకపోతే ప్రయాణ సమయంలో బుక్ చేసుకున్నప్పటికీ మీకు ఆహారం లభించదు. ముందుగానే ఆహారాన్ని సెలక్ట్ చేసుకోని ప్రయాణీకులకు అడిగితే ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.