NTV Telugu Site icon

Indian railways Jobs 2024: ఇండియన్ రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Railway Jobs

Railway Jobs

రైల్వేలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. తాజాగా రైల్వే శాఖ భారీగా పోస్టులను విడుదల చేసింది.. వేల సంఖ్యలో ట్రైన్‌ డ్రైవర్‌ అంటే అసిస్టెంట్‌ లోకో పైలెట్‌(ఏఎల్‌పీ) పోస్టులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలోనూ ఏఎల్‌పీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 19వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. అర్హతలు, జీతం వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు..5,696

అర్హతలు..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారు కనీసం ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఏఐసీటీటీ గుర్తింపు ఉన్న ఏదైనా విద్యాంస్థ నుంచి పైన పేర్కొన్న బ్రాంచ్‌లలోనే ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు..

వయస్సు..

18ఏళ్లు నిండి ఉండాలి. 30 ఏళ్ల లోపు వారై ఉండాలి. అయితే కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు వయసు సడలింపు ఉంటుంది..

దరఖాస్తు ఫీజు..

ఈ పోస్టులకు దరఖాస్తులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి.. జనవరి 20నుంచే ఆన్‌లైన్లో సైట్‌ ఓపెన్‌ అయ్యింది. ఫిబ్రవరి 19 వరకూ దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు అభ్యర్థులకు ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్‌-సర్మీస్‌మెన్‌తోపాటు మహిళలకు రూ.250.. మిగిలిన వారికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది..

వేతనం..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి నెల నుంచే వేతనం రూ. 19,900 ఉంటుంది. గరిష్టంగా రూ. 63,200 వరకూ పెరుగుతుంది..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు అధికార వెబ్ సైట్ ను పరిశీలించగలరు..

Show comments