Check Amrit Bharat Express Ticket Price: ‘అమృత్ భారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వేశాఖ త్వరలో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ రైళ్ల ఛార్జీలను మెయిల్/ఎక్స్‌ప్రెస్‌ల రైళ్లలో సంబంధిత తరగతి ప్రయాణాల కంటే 15-17 శాతం ఎక్కువగా ఉంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఇతర మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌ల కంటే సెకండ్ క్లాస్ అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌ల బేస్ ఫేర్ దాదాపు 17 శాతం ఎక్కువగా ఉందని ఓ రైల్వే అధికారి తెలిపారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అనేక అదనపు ప్రయాణీకుల సౌకర్యాల కారణంగా టికెట్ చార్జీలు పెరిగాయని చెప్పారు.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 50 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించడానికి కనీస ధర సెకండ్ క్లాస్ కోచ్‌కు రూ. 35గా ఉంది. మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ప్రయాణానికి ధర రూ. 30గా ఉంటుంది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 15 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి స్లీపర్ క్లాస్‌కు రూ. 46 ఉండగా.. 50 కిలోమీటర్లకు రూ. 65గా ఉంది. గరిష్టంగా 5000 కిలోమీటర్ల దూరంకు సెకండ్ క్లాస్ కోచ్‌కు రూ. 933 ఉండగా.. స్లీపర్ క్లాస్‌కు రూ. 1469గా ఉంది. ఏయే దూరానికి ఎంతెంత ఛార్జీలు వసూలు చేసేదీ తెలిపే పట్టికను భారతీయ రైల్వే రిలీజ్ చేసింది.
Also Read: IND vs AFG: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్.. భారత కెప్టెన్ ఎవరు?
డిసెంబర్ 30న రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆరంబించనున్నారు. మొదటి రైలు ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అయోధ్య మీదుగా బీహార్‌లోని దర్భంగా వరకు వెళ్లనుంది. ఈ రైలులో సెకెండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ మాత్రమే ఉంటాయి. ఏసీ తరగతుల రుసుములు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఇక రెండవ రైలు మాల్దా మరియు బెంగళూరు మధ్య నడుస్తుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమరయోధుల పాసులు/ కూపన్లు ఈ రైళ్లలో చెల్లుతాయి.