Site icon NTV Telugu

Brahmos Missile : బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష సక్సెస్.. ప్రకటించిన ఇండియన్‌ నేవీ

Brahmos

Brahmos

Brahmos Missile : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం భారత నావికాదళం ఆరేబియాసముద్రంలో నిర్వహించిన ఈ మిసైల్ నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. ఆత్మనిర్బర్‌ భారత్‌ నిర్మాణంలో భాగంగా ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని ఇండియన్‌ నేవీ ప్రకటించింది. కోల్ కతా శ్రేణి క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక ఈ పరీక్షకు వేదిక అయింది. భారత నావికాదళం ఇవాళ అరేబియా సముద్రంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించింది.

Read Also: Summer Tips: వేసవిలో ఇవి తీసుకుంటే సూర్యుడు ఎంత వేడిగా ఉన్నా.. మీరు చల్లగా ఉంటారు

కాగా, సముద్ర తలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్ (DRDO) పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. క్షిపణుల్లో స్వదేశీ తయారీ క్షిపణుల సంఖ్యను పెంచేందుకు బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ నిరంతరాయంగా కృషి చేస్తున్నదని ఇండియన్‌ నేవీ అధికారులు పేర్కొన్నారు. కోల్ కతా లోని మిసైల్ డిస్ట్రాయర్ వార్ షిప్ నుంచి ఈ బ్రహ్మోస్ మిసైల్ ని ప్రయోగించారు. సీకర్, బూస్టర్ తో కూడిన ఈ క్షిపణి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుందని నేవీ అధికారులు చెప్పారు. గత నెలలో ఇండియన్ నేవీ పైలట్లు ఐసీఏ తేజాస్, మిగ్-29 విమానాలను ఐఎన్ ఎస్ విక్రాంత్ నౌక పై లాండింగ్ చేయించగలిగారు.

Exit mobile version