Site icon NTV Telugu

Indian Navy Submarines: అణు సబ్‌మెరిన్ల దిశగా భారత నౌకాదళం.. మరో 9 కొత్త సబ్‌మెరిన్లు?

Indian Navy Submarines

Indian Navy Submarines

Indian Navy Submarines: భారత్ ఎప్పటికప్పుడు తన రక్షణ శక్తులను పెంచుకుంటూ పోతుంది. ఇందులో భాగంగానే తాజాగా భారత నౌకాదళం మరింత బలపడేందుకు మరో పెద్ద అడుగు వేయబోతోంది. అతి త్వరలో 9 ఆధునిక డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరిన్లు నౌకాదళంలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీటి ధరలపై చర్చలు జరుగుతుండగా, తర్వాత మంత్రివర్గ భద్రతా కమిటీ (CCS) నుంచి ఆమోదం లభించనుంది. ఈ సబ్‌మెరిన్లు మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో నిర్మించబడతాయి.

AFG vs PAK: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ పాకిస్తాన్.. ఆఫ్గనిస్తాన్ అద్భుత విజయం!

ఇప్పటికే భారతదేశం 2005లో ఫ్రాన్స్‌తో కలిసి ప్రాజెక్ట్-75లో భాగంగా 6 స్కార్పీన్ తరగతి సబ్‌మెరిన్లు నిర్మించుకుంది. వాటిలో కల్వరి, ఖండేరి, కరంజ్, వేళా, వగీర్, వగశీర్ నౌకాదళంలో చేరి వాటి పనిని చేస్తున్నాయి. ఇవి టార్పెడో, యాంటీ-షిప్ మిసైళ్లతో రహస్యంగా దాడి చేయగలిగే అత్యాధునిక అటాక్ సబ్‌మెరిన్లలో ఒకటిగా గుర్తించబడ్డాయి. ఇక ఈ ప్రాజెక్ట్-75 ఫాలో ఆన్ ఆర్డర్ కింద భారత నౌకాదళానికి మరో 3 కొత్త సబ్‌మెరిన్లు రాబోతున్నాయి. అలాగే ప్రాజెక్ట్-75 ఇండియా కింద 6 సబ్‌మెరిన్ల ఒప్పందం కూడా ముందుకు వెళ్తోంది. అంటే రాబోయే కాలంలో మొత్తం 9 సబ్‌మెరిన్లు నౌకాదళ శక్తిలో చేరనున్నాయి.

Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి, 30 మందికి గాయాలు!

డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరిన్లతో పాటు అణు సబ్‌మెరిన్ల ద్వారానూ భారత నౌకాదళం శక్తివంతం కానుంది. ప్రస్తుతం భారతదేశం వద్ద 17 డీజిల్-ఎలక్ట్రిక్, 2 న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరిన్లు (SSBN) ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం 2 అణు అటాక్ సబ్‌మెరిన్ల (SSN) నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో మొదటి స్వదేశీ SSN సబ్‌మెరిన్ 2036-37 నాటికి నౌకాదళంలో చేరే అవకాశం ఉంది.

Exit mobile version