Site icon NTV Telugu

King Charles: బ్రిటన్ రాజు చార్లెస్‌ను కలిసిన టీమిండియా..!

King Charles

King Charles

King Charles: లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత టీమిండియా పురుషులు, మహిళా క్రికెట్ జట్లు బ్రిటన్ రాజు చార్లెస్ ను లండన్‌ లోని క్లారెన్స్ హౌస్ లో మంగళవారం (జూలై 15) కలిశాయి. ఈ సందర్బంగా.. రాజు చార్లెస్ భారత జట్లతో మమేకమై, లార్డ్స్‌ లో జరిగిన ఇంగ్లాండ్, భారత్ మూడో టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్‌లను తాను చూశానని పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌ లో టీమిండియా ఐదో రోజు తొందరగా ఎనిమిది వికెట్లు కోల్పోయినప్పటికీ చివరికి కేవలం 22 పరుగుల తేడాతో ఓడిపోయిందని అన్నారు. అలాగే చివరి వికెట్‌గా మహ్మద్ సిరాజ్, షోయబ్ బషీర్ బౌలింగ్‌లో బంతి స్టంప్స్‌కి తగిలి అవుటయ్యాడని బ్రిటన్ రాజు చార్లెస్ ప్రత్యేకంగా గుర్తు చేశారు.

Read Also:HMD T21 Tablet: వాయిస్ కాలింగ్, 8200mAh బ్యాటరీతో HMD T21 విడుదల..!

ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. బ్రిటన్ రాజు చార్లెస్‌ను కలవడం ఒక అద్భుతమైన అనుభవం అని అన్నారు. ఆయన ఎంతో సౌమ్యంగా, ఆత్మీయంగా మాతో మాట్లాడారని.. లార్డ్స్ టెస్టు గురించి ప్రత్యేకంగా అడిగారని చెప్పుకొచ్చారు. చివరి ఆటగాడు (సిరాజ్) అవుట్ అయిన తీరును గురించి ఆయన పేర్కొన్నారని తెలిపాడు. అది నిజంగా దురదృష్టకరం. ఆ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ వాళ్లైనా గెలిచే అవకావం ఉండేది. కానీ, తక్కువ తేడాతో ఓడిపోయాం అని అంటూనే.. తర్వాతి రెండు మ్యాచ్‌లలో గెలవాలనే ధీమాతో ఉన్నాం అని గిల్ తెలిపారు. ఈ సమావేశం భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ మధ్య కొనసాగుతున్న సిరీస్ కు ఒక మర్యాదాపూర్వక విరామంలా మారింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న మహిళల జట్టు సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.

Read Also:Zee Telugu: స్క్రీన్ రైటర్ల కోసం ‘జీ’ రైటర్స్ రూమ్!

Exit mobile version