Lottery Win: అదృష్టమంటే ఇతడిదే..! ఫ్రీ లాటరీ టికెట్‌తో కోట్లు వచ్చిపడ్డాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతమందికి అదృష్టం భలే కలిసొస్తుంటుంది. కొందరి జీవితాలు ఊహించని విధంగా మారుతుంటాయి. అనూహ్యంగా ఓ భారతీయుడి కుటుంబానికి అదృష్టం తలుపుతట్టింది (Lottery Win). ఎక్కడా? ఏంటో.. తెలియాలంటే ఈ వార్త చదవండి.
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్‌లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్‌లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రాలో భారతీయ వలసదారు రాజీవ్ రూ. 33 కోట్ల ఫ్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. గత మూడేళ్లుగా రాజీవ్ బిగ్ టికెట్ డ్రాలో పాల్గొంటున్నాడు. రాజీవ్ ప్రస్తుతం అల్ ఐన్‌లోని ఆర్కిటెక్చరల్ సంస్థలో పనిచేస్తున్నాడు. రాజీవ్.. తన భార్య, పిల్లలపై లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఈసారి మాత్రం అదృష్టం లభించింది. ఏకంగా రూ.33 కోట్లు గెలుచుకున్నాడు.
కేరళ (Kerala)కు చెందిన రాజీవ్ (Rajeev Arikkatt) కొన్నేళ్లుగా యూఏఈ(UAE)లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజీవ్ గత మూడేళ్లుగా బిగ్ టికెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈసారి ఆయనకు ఆరు టికెట్లు లభించాయి. బిగ్ టికెట్‌పై ఈసారి స్పెషల్ ఆఫర్ లభించింది. రెండు టికెట్లు కొంటే నాలుగింటిని ఉచితంగా పొందాడు. రాజీవ్, అలాగే తన భార్య పేరు మీద 7, 13 నంబర్లతో ఉన్న టికెట్లు కొన్నారు. ఆ టికెట్లు కూడా పిల్లల పుట్టినరోజు తేదీలతో తీసుకున్నారు. ఒరిజనల్‌గా రెండు టికెట్లు కొంటే నాలుగు టికెట్లు ఉచితంగా లభించాయి. ఆ ఫ్రీ టికెట్లో ఒకటి విజయం సాధించింది. లాటరీ తగలినట్లు ప్రకటన చేయగానే కుటుంబమంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు. సుమారు రూ.33 కోట్లు గెలుచుకున్నారు.
తాను గెల్చుకున్న రూ.33 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలన్న దానిపై ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాజీవ్ తెలిపారు. తన ఉదార హృదయాన్ని మాత్రం చాటుకున్నాడు. ఆ డబ్బును మరో 19 మందితో సమానంగా పంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!