Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Job Interview Tips: కెనడాలో నివసిస్తున్న భారతీయ ప్రొడక్ట్ మేనేజర్ కరణ్ గొగ్నా సోషల్ మీడియాలో పంచుకున్న ఓ ఉద్యోగ ఇంటర్వ్యూ అనుభవం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంటర్వ్యూలో చివర్లో అడిగిన ఒక్క ప్రశ్న కారణంగా తాను ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయానని ఆయన చెప్పడంతో, ఉద్యోగార్థుల మధ్య ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఇంటర్వ్యూలో ఏమి జరిగింది?
కరణ్ గొగ్నా కెనడాలోని యూజ్డ్ కార్ల వ్యాపారానికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీలో ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. అన్ని ఇంటర్వ్యూ రౌండ్లను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు, హెచ్ఆర్ ఆయన డాక్యుమెంట్లు కూడా తీసుకుంది. దీంతో ఉద్యోగ ఆఫర్ దాదాపు ఖాయమైందని ఆయన భావించారు. అయితే ఆఫర్ లెటర్ ఇచ్చే ముందు కంపెనీ సీఈవోతో ఒక చివరి సమావేశం ఉంటుందని హెచ్ఆర్ తెలిపింది. ఆ సమావేశం కూడా చాలా సానుకూలంగా సాగిందని కరణ్ వెల్లడించారు.
Also Read
- Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
- Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
- Saudi Arabia: ‘‘తలలు నరికేశారా, మృతదేహాలు ఎక్కడ.?’’ సౌదీకి బంగ్లాదేశ్ 6 ప్రశ్నలు..
- Mann Ki Baat: ‘‘మన్ కీ బాత్’’కి 12 ఏళ్లు.. ప్రధాని మోడీ భావోద్వేగ వ్యాఖ్యలు
ఒక్క ప్రశ్నతో మారిన పరిస్థితి
ఇంటర్వ్యూ ముగిసే సమయంలో సీఈవో, “మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?” అని అడిగారు. దీనికి కరణ్, “కంపెనీ భవిష్యత్తులో టూ-వీలర్ మార్కెట్లోకి ప్రవేశించాలని భావిస్తోందా?” అని ప్రశ్నించారు. అయితే సీఈవో నేరుగా సమాధానం చెప్పకుండా, “మీ అభిప్రాయం ఏమిటి? మేము ఆ రంగంలోకి వెళ్లాలా?” అని తిరిగి ప్రశ్నించారు. నాలుగు చక్రాల వాహనాల మార్కెట్‌పై తాను పూర్తిగా సిద్ధమయ్యానని, కానీ టూ-వీలర్ విభాగంపై ఎలాంటి విశ్లేషణ చేయకపోవడంతో స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయానని కరణ్ తన పోస్టులో పేర్కొన్నారు.
మరుసటి రోజే రిజెక్షన్
ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చిందని, కంపెనీ మరో అభ్యర్థిని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం ఇచ్చారని కరణ్ తెలిపారు. ఈ సంఘటన జరిగిన ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా, చివర్లో జరిగిన ఆ ప్రశ్నోత్తరాలే తన ఎంపికపై ప్రభావం చూపి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉద్యోగార్థులకు కరణ్ ఇచ్చిన సలహా
ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులు సమాధానాలు సిద్ధం చేసుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెడతారని, కానీ ఇంటర్వ్యూవర్ను ఏమి అడగాలి అనే విషయంలో అంతగా సిద్ధం కాదని కరణ్ పేర్కొన్నారు. “మీరు అడిగే చివరి ప్రశ్న కూడా మీ ఆలోచనా విధానాన్ని అంచనా వేసే అవకాశం కావచ్చు. అందుకే ప్రశ్న అడిగే ముందు దాని ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి. అలాగే ఆ ప్రశ్న మీకే తిరిగి వస్తే ఎలా సమాధానం చెప్పాలో కూడా ముందుగానే సిద్ధంగా ఉండాలి” అని ఆయన సూచించారు.
నెటిజన్ల స్పందన
కరణ్ పోస్టుకు వేలాది మంది స్పందించారు. కొందరు ఉద్యోగార్థులు కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నట్లు కామెంట్లు చేశారు. మరికొందరు మాత్రం ఉద్యోగం రాకపోవడానికి ప్రశ్న కారణం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, సీఈవో అసలు పరీక్షించింది ప్రశ్నను కాదని, అనూహ్య పరిస్థితుల్లో అభ్యర్థి ఎలా ఆలోచిస్తాడు, ఒత్తిడిలో ఎలా స్పందిస్తాడు అనే అంశాలను కావచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన ఉద్యోగ ఇంటర్వ్యూల్లో సమాధానాలతో పాటు సరైన ప్రశ్నలు అడగడం, వాటిపై అవగాహన కలిగి ఉండటం కూడా ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది.
తాజావార్తలు
-
Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
-
Jr NTR: త్రివిక్రమ్, తమన్లకు తారక్ క్లాస్.. అప్పట్లో జరిగిందిదేనట!
-
AP ZPTC Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
Saudi Arabia: ‘‘తలలు నరికేశారా, మృతదేహాలు ఎక్కడ.?’’ సౌదీకి బంగ్లాదేశ్ 6 ప్రశ్నలు..
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?