Site icon NTV Telugu

Work From Home: తండ్రి మరణం.. ఉద్యోగి బాధను లైట్‌ తీసుకున్న కంపెనీ.. చివరకు..?

Work From Home

Work From Home

Work From Home: జీవితం అన్నాక.. పుట్టుక, జీవిచడం, మరణించడం జరగాల్సిందే. అయితే ఈ జీవినిచే సమయంలో మనిషి ఎన్నో విషయాలను అలవరుచుకొని జీవనాన్ని కొనసాగిస్తాడు. ఇది ఇలా ఉండగా.. ఓ భారతీయ ఐటీ ఉద్యోగి తన తండ్రి మృతికి సంబంధించి తాను ఎదుర్కొన్న బాధను సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. తన తండ్రి మరణిస్తే.. వర్క్ ఫ్రం హోమ్ (WFH) అనుమతిని తిరస్కరించిన తన మేనేజర్ వ్యవహారాన్ని పంచుకున్నాడు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

Read Also:Google Pixel 10: మొబైల్ మార్కెట్‌ను దున్నేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసిన గూగుల్.. Pixel 10 సిరీస్ విడుదలకు రంగం సిద్ధం..!

ఇక ఆ ఉద్యోగి తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండగా ఆయన ఐదు రోజుల సెలవు తీసుకున్నాడు. తండ్రి మరణానంతరం ఇంటి పనులు, సంస్కారాల నిర్వహణ కోసం వారం రోజులపాటు వర్క్ ఫ్రం హోమ్ చేశాడు. అయితే తల్లి ఒంటరిగా ఉన్న కారణంగా, మరో నెల రోజుల పాటు WFH కోరిన అతడి అభ్యర్థనను క్లయింట్ మేనేజర్ నిరాకరించాడు. అంతేకాకుండా.. సంస్కారాలు ముగించుకొని, ఆ తర్వాత కార్యాలయానికి రావాలని ప్లాన్ చేయండి అని మేనేజర్ పంపిన సందేశాన్ని ఉద్యోగి షేర్ చేశాడు. అంతటితో ఆగకుండా ఉద్యోగి ఫోన్ కాల్‌లో మాట్లాడాలని కోరినా మేనేజర్ స్పందించలేదని పేర్కొన్నాడు.

Read Also:Allu Arjun: స్వామి కార్యం.. స్వకార్యం చక్కబెట్టేస్తున్న బన్నీ!

తండ్రి మరణం నుంచి పూర్తిగా కోలుకోకముందే ఇలా WFH నిరాకరించడంపై ఉద్యోగి తీవ్ర స్థాయిలో ఉద్వేగం చెందాడు. కుటుంబానికి అండగా ఉండాలన్న తపనలో కంపెనీ నుంచి సహాయం లేకపోవడంతో తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ “ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?” అనే ప్రశ్నను వినియోగదారుల ముందు ఉంచాడు. ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు ఉద్యోగికి మద్దతుగా నిలిచారు. వేలాది మంది వినియోగదారులు స్పందిస్తూ.. కంపెనీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

WFH request denied for my father’s demise
byu/boombaa0 inIndianWorkplace

Exit mobile version