Site icon NTV Telugu

Singapore: మద్యం మత్తులో సహోద్యోగి చెవిని కొరికినందుకు భారతీయుడికి జైలు శిక్ష

Singapore

Singapore

Singapore: 2020లో మద్యం మత్తులో ఉన్న భారతీయుడు మరో కార్మికుడి చెవిని ఒకదాన్ని కొరికి అతన్ని తిట్టినందుకు 37 ఏళ్ల భారతీయ పౌరుడికి ఐదు నెలల జైలు శిక్ష, 1,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించబడింది. తమిళనాడుకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు మనోహర్ శంకర్ ఇతరులతో కలిసి సింగపూర్‌లోని వర్కర్స్ అపార్ట్‌మెంట్‌లో బస చేసినట్లు ఛానల్ న్యూస్ ఏషియా సోమవారం వెల్లడించింది.

మే 19, 2020న, సహోద్యోగితో కలిసి అపార్ట్‌మెంట్ పైకప్పుపై శంకర్ మద్యం సేవిస్తున్నాడు. శంకర్‌ తన సహోద్యోగి అయిన 47 ఏళ్ల భారతీయుడిని తమిళంలో అసభ్యకర పదజాలంతో దూషించడం ప్రారంభించాడు. అతడు తనను తిట్టడం మానేయాలని శంకర్‌ను కోరాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఇద్దరు గొడవపడ్డారు.

Also Read: Uddhav Thackeray: పరువు నష్టం కేసులో ఉద్ధవ్ ఠాక్రేకు కోర్టు సమన్లు జారీ

వీరిద్దరు గొడవపడి కిందపడిపోవడంతో శంకర్ బాధితుడి ఎడమ చెవి భాగాన్ని కొరికాడు. ఇంతలోనే వీరిని గొడవను చూసి ఇతరులు అక్కడికి చేరుకుని వారిద్దరిని వేరుచేసి.. బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. శంకర్‌ తాను మద్యం మత్తులో దుర్భాషలాడినట్లు, తీవ్రంగా గాయపరిచినట్లు స్వయంగా నేరాన్ని అంగీకరించాడు. ఈ నేపథ్యంలో శంకర్ చేసిన నేరాలకు ఐదు నెలల జైలు శిక్ష 1,000 సింగపూర్ డాలర్లు ($740) జరిమానా విధించబడింది. ఇదిలా ఉండగా బాధితుడి చెవు 2 సెంటిమీటర్ల మేర కోల్పోయాడని ఆస్పత్రిలో ఓ వైద్యుడు తెలిపాడు.

Exit mobile version