Site icon NTV Telugu

Paris Olympics 2024: భారత్ ఖాతాలో మరో పతకం..

Hockey

Hockey

పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు బంగారు పతకం గెలుస్తుందని చాలా అంచనాలు ఉండేవి. అది నిజం చేశారు.. స్వర్ణం సాధించలేకపోయినప్పటికీ, భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతక పోరులో భారత్ 2-1తో స్పెయిన్‌ను ఓడించింది. అంతకుముందు సెమీస్‌లో జర్మనీ చేతిలో భారత్ 3-2 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఒలింపిక్స్‌లో భారత్ అత్యధిక విజయాలు సాధించిన క్రీడ హాకీ. హాకీలో భారత్ ఇప్పటి వరకు ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించింది.

Pawan Kalyan: సినీ హీరోలపై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నాదెండ్ల

2020 లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 5-4తో జర్మనీని ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్ క్రీడల్లో 41 ఏళ్ల తర్వాత పతకం సాధించింది. 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత ఇది మొదటిది. హాకీలో భారత్‌కు ఇది మూడో కాంస్య పతకం. ఈసారి పురుషుల జట్టు పతకం రంగు మార్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. గ్రూప్ దశ నుంచి ఇప్పటి వరకు భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.

Kangana ranaut: కంగనా రనౌత్‌‌కు కాంగ్రెస్ షాక్.. రూ.40 కోట్ల పరువు నష్టం దావా

గ్రూప్‌ దశలో భారత్‌ పూల్‌ బిలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచిన భారత జట్టు.. తన గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ సమయంలో ఒక మ్యాచ్ డ్రా కాగా, ఒక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓడిపోయింది. గ్రూప్ దశలో బెల్జియంపైనే టీమ్ ఇండియా ఓటమి పాలైంది. మరోవైపు.. ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ కు వచ్చిన భారత్.. బ్రిటన్‌ను ఓడించింది. కాగా.. సెమీ ఫైనల్లో భారత జట్టు జర్మనీ చేతిలో ఓడిపోయింది. ఇదిలాఉంటే.. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మొత్తం 4 కాంస్య పతకాలు చేరాయి.

Exit mobile version