Site icon NTV Telugu

Jagdeep Singh Arrest: అమెరికాలో ఇండియన్ గ్యాంగ్‌స్టర్ జగ్గా అరెస్ట్..

Jagga

Jagga

Jagdeep Singh Arrest: అమెరికాలో ఇండియన్ గ్యాంగ్‌స్టర్ జగ్గా అరెస్ట్ అయ్యాడు. రాజస్థాన్, పంజాబ్‌లలో అనేక క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్టర్ జగ్దీప్ సింగ్ అలియాస్ జగ్గాను అమెరికాలో అరెస్టు చేశారు. ఆయన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సన్నిహితుడు, ప్రస్తుతం రోహిత్ గోదారా నెట్‌వర్క్‌తో సంబంధం కలిగి ఉన్నాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. జగ్గాను అమెరికా – కెనడా సరిహద్దు సమీపంలో అరెస్టు చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జగ్గాను భారతదేశానికి అప్పగించడానికి చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమైంది.

READ ALSO: Montha Cyclone Alert : ఉప్పాడ తీరంలో భయానకంగా సముద్రం..

పలు నివేదికల ప్రకారం.. రాజస్థాన్ పోలీసుల యాంటీ-గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (AGTF), అనేక దేశీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో, సమన్వయంతో ఈ అరెస్టులు జరిగాయని అధికారులు వెల్లడించారు. జగ్గ విదేశీ కార్యకలాపాలపై AGTF కచ్చితమైన నిఘా సమాచారాన్ని సేకరించి, అమెరికా అధికారులతో సమన్వయం చేసుకుని, ఆయన్ని అరెస్టు చేసింది. జగ్గాను భారతదేశానికి అప్పగించడానికి చర్యలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు.

పంజాబ్‌లోని మోగా జిల్లాలోని ధురోకోట్ గ్రామానికి చెందిన జగ్గా, కొన్నేళ్లుగా విదేశాల నుంచి నేర కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. భారతదేశంలో దోపిడీ, కాంట్రాక్ట్ హత్యలు చేయడానికి ఆయనకు పెద్ద కమ్యూనికేషన్ ఛానెల్‌లు, విదేశీ సహచరులను ఉపయోగించుకునే వాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. భారతదేశ నిఘా అధికారుల నుంచి తప్పించుకోవడానికి ఆయన తరచుగా దేశాలు మారుస్తుండేవాడని అధికారులు చెప్పారు.

అనేక వారెంట్లు జారీ చేసిన రాజస్థాన్ కోర్టు..
ADG (AGTF) ​​దినేష్ MN మాట్లాడుతూ.. “జగ్గపై రాజస్థాన్ కోర్టులు అనేక అరెస్ట్ వారెంట్లు జారీ చేశాయి. ఆ వారెంట్లపై చర్య తీసుకుంటూ, AGTF ఆయనను విదేశీ కార్యకలాపాల గురించి కచ్చితమైన నిఘా సమాచారాన్ని సేకరించి, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకొని అరెస్ట్ చేసింది” అని వెల్లడించారు. ఈ నిఘా సమాచారం తర్వాత, అమెరికా అధికారులు కెనడా- అమెరికా సరిహద్దు సమీపంలో తనను పర్యవేక్షించి అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు. జగ్గాను అప్పగించడానికి చట్టపరమైన, దౌత్యపరమైన విధానాలు ముందుకు సాగుతున్నాయని, ఆయన ఇప్పటికీ అమెరికా కస్టడీలోనే ఉన్నాడని అధికారులు తెలిపారు. భారత ప్రభుత్వం ఇప్పటికే జగ్గాపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.

READ ALSO: Karnataka: సిద్ధరామయ్య ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కర్ణాటక హైకోర్టు..

Exit mobile version