Site icon NTV Telugu

FIFA 2026 World Cup Qualifiers: ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో ఖతార్‌పై భారత ఫుట్‌బాల్ జట్టు ఓటమి

Foot Ball

Foot Ball

భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో ఖతార్‌తో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ 2026 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 0-3 తేడాతో ఓడిపోయింది. సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత ఫుట్‌బాల్ జట్టు.. అంతకుముందు కువైట్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఖాతా తెరవకుండానే బ్లూ టైగర్స్ ఓటమి పాలైంది

Read Also: Apple iPhone 16 : సూపర్ ఫీచర్లతో ఆపిల్ ఐఫోన్ 16 వచ్చేస్తోంది.. ఆన్లైన్లో లీకైన డేటా ఇదే..

ఈ మ్యాచ్ లో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ప్రత్యర్థి ఖతార్.. మ్యాచ్ ఆరంభం నాలుగో నిమిషంలోనే గోల్ చేసింది. ఖతార్‌ ఆటగాడు ముస్తఫా మషాల్‌ తన జట్టుకు తొలి గోల్‌ సాధించాడు. ఆ తర్వాత ఖతార్‌ను భారత ఆటగాళ్లు ఫస్టాప్ వరకు రెండో గోల్‌ చేయకుండా కట్టడి చేశారు. దీంతో ఫస్టాప్ ముగిసేసరికి ఖతార్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కాగా.. సెకండాఫ్ ఆరంభంలోనే ఖతార్‌ రెండో గోల్‌ చేసింది. 47వ నిమిషంలో అల్మోజ్ అలీ ఖతార్ తరఫున రెండో గోల్ చేశాడు. దీంతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న టీమిండియాకు మరింత కష్టమైంది. దీంతో.. ప్రత్యర్థి ఖతార్ 2-0తో ముందంజలో ఉంది. ఆ తర్వాత భారత్‌కు కొన్ని అవకాశాలు వచ్చినా గోల్స్‌గా చేయలేకపోయింది.

Read Also: Harish Rao : ఎన్నికలంటే మూడు రోజుల పండగ కాదు, ఐదేండ్ల భవిష్యత్తు

ఖతార్ రెండో గోల్ చేసిన తర్వాత.. చాలా సేపు గోల్ లేకుండానే గేమ్ కొనసాగింది. అయితే మ్యాచ్ ముగియడానికి కొద్ది సేపటి ముందు మూడో గోల్ చేసింది ఖతార్. 86వ నిమిషంలో యూసుఫ్‌ మూడో గోల్‌ చేశాడు. ఈ గోల్ తో భారత్ గెలుపు ఆశలు దాదాపుగా ముగిశాయి. దీంతో టీమిండియా చివరి వరకు ఎలాంటి గోల్‌ చేయలేక ఓడిపోయింది.

Exit mobile version