layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
layoffs: సాయంత్రం షిఫ్ట్‌లో ప్రశాంతంగా పని చేసుకుంటున్న ఉద్యోగులకు హఠాత్తుగా ఒక మీటింగ్ ఇన్విటేషన్ వచ్చింది. ఆన్-లైన్లో లాగిన్ అయిన కొద్ది నిమిషాల్లోనే వారి జీవితాలు తలకిందులైపోయాయి. ఒక అమెరికన్ ఫైనాన్షియల్ సంస్థలో పనిచేస్తున్న భారతీయ కస్టమర్ సర్వీస్ టీమ్‌కు కేవలం ఐదు నిమిషాల గూగుల్ మీట్ కాల్‌తో ఊహించని షాక్ తగిలింది. ఈ సంఘటనను ఆ టీమ్‌లో పనిచేసిన ఓ ఉద్యోగి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్ (Reddit) వేదికగా పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన ఒక ప్రముఖ బ్యాంక్‌కు సంబంధించి భారత్‌లో ఉన్న కస్టమర్ సపోర్ట్ టీమ్ మొత్తాన్ని ఒక్క దెబ్బకు తొలగించారు. ఆ రోజు సాయంత్రం 6:30 గంటల షిఫ్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాత్రి 9:30 గంటల సమయంలో అత్యవసరంగా ఒక గూగుల్ మీట్ లింక్ పంపించారు. తీరా మీటింగ్‌లో జాయిన్ అయ్యాక, భారతీయ కస్టమర్ సర్వీస్ టీమ్ మొత్తాన్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు బాంబు పేల్చారు.
కేవలం ఆ ఐదు నిమిషాల కాల్‌తో ఏకంగా 80 మంది ఉద్యోగులు వీధిన పడ్డారు. “అందరూ ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోయారు.. ఆ ఒక్క ఐదు నిమిషాల కాల్ 80 కుటుంబాల జీవితాలను రోడ్డున పడేసింది. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు తోసేసే ఇలాంటి కార్పొరేట్ కంపెనీల కోసం రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినందుకు చాలా బాధగా ఉంది” అని ఆ ఉద్యోగి తన ఆవేదనను వెళ్లగక్కారు. ఉన్నపళంగా ఉద్యోగం ఊడిపోవడంతో ఇప్పుడు మరో ఉద్యోగం ఎలా వెతుక్కోవాలో పాలుపోవడం లేదని, ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ లబోదిబోమన్నారు. అసలు అంతమందిని ఒక్కసారిగా ఎందుకు తీసేశారనే దానికి సమాధానంగా.. భారతీయ టీమ్ నుంచి తమకు అనుకున్నంత స్థాయిలో అవుట్‌పుట్ (ఫలితాలు) రావడం లేదని కంపెనీ భావించినట్లు ఆ ఉద్యోగి తెలిపారు. అమెరికా టీమ్‌తో పోలుస్తూ మన ఉద్యోగుల పనితీరును తక్కువ చేసి చూపడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఇక్కడి ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకునే పనిచేశారని పేర్కొన్నారు. అయితే ఈ లేఆఫ్స్‌కు సంబంధించి ఆ అమెరికన్ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనగానీ, వివరణగానీ రాలేదు. పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించేటప్పుడు అనుసరిస్తున్న ఇటువంటి క్రూరమైన పద్ధతులు, ఉద్యోగులకు ఇచ్చే మద్దతుపై ఈ ఉదంతం తీవ్రమైన చర్చకు దారితీసింది.
Also Read
- Sonakshi Sinha: ‘‘రాజీవ్ ఒడిలో సోనియా’’.. రాహుల్ గాంధీకి సోనాక్షి సిన్హా మద్దతు!
- Aura Kid: 'ఆరా కిడ్'గా ఫేమస్ అయిన రెండేళ్ల బుడతడు.. 139M వ్యూస్‌తో ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో..
- Yashasvi Jaiswal: కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్..? ఆ డీల్ కుదరాలంటే ఉన్న పెద్ద చిక్కు ఇదే..
- PM Modi: ‘‘తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం’’ మన కల్చర్ కాదు.. మోడీ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Interesting Facts: 4,000 ఏళ్ల రహస్యం.. వారం 7 రోజులే ఎందుకు? అసలు నిజం ఇదే!
-
Suriya Scene: సూర్య ‘సీన్’ సినిమా కాపీనా.. డిట్టో దింపేశారా?
-
Sonakshi Sinha: ‘‘రాజీవ్ ఒడిలో సోనియా’’.. రాహుల్ గాంధీకి సోనాక్షి సిన్హా మద్దతు!
-
Aura Kid: ‘ఆరా కిడ్’గా ఫేమస్ అయిన రెండేళ్ల బుడతడు.. 139M వ్యూస్‌తో ఇన్‌స్టాను షేక్ చేస్తున్న వీడియో..
-
Henry Nicholls: భారత్‌పై పోరాటం.. భార్య పుట్టినరోజునే సెంచరీ.. హెన్రీ నికోల్స్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!