Site icon NTV Telugu

Tiger Robi: భారత్-బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్.. బంగ్లా అభిమానిపై దాడి..!

Tiger Robi

Tiger Robi

భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరగడంతో క్రికెట్ జట్టు ఆటగాళ్లకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే మ్యాచ్‌కు వ్యతిరేకంగా వీహెచ్‌పీ బంగ్లాదేశ్ జెండాను దహనం చేసి రచ్చ చేశారు. ఈ క్రమంలో మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన బంగ్లా వీరాభిమాని టైగర్ రాబీపై కొందరు దాడి చేశారు. దీంతో.. పోలీసులు అతడిని ఆస్పత్రిలో చేర్చారు.

Read Also: Yemen-Israel: ఇజ్రాయెల్‌పై ప్రతీకారం..! యెమెన్‌ తిరుగుబాటుదారులు దాడి

ఈ క్రమంలో.. టైగర్ రాబీ స్టార్ స్పోర్ట్స్‌తో, “నా వెనుక, దిగువ పొత్తికడుపుపై ​​కొట్టారు. ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను” అని చెప్పాడు. అయితే.. స్టేడియంలో ఉన్న పోలీసులు ఈ దాడి ఆరోపణలను ఖండించారు. “మా అధికారి ఒకరు సి బ్లాక్‌లోని ప్రవేశ ద్వారం దగ్గర ఒక వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం చూశాడు, అది డీహైడ్రేషన్ కేసు. అయితే మేము వైద్యుల వివరాలు వెల్లడి కోసం వేచి ఉంటాము” అని పోలీసు వర్గాలు తెలిపాయి.

Read Also: Sri Sri Sri Raja Varu: దేవర రిలీజ్ రోజే బామ్మర్ది సినిమా టీజర్.. చూశారా?

ఇదిలా ఉంటే.. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆట వెలుతురులేమి కారణంగా నిలిచిపోయింది. ఆట నిలిచిపోయే సమయానికి బంగ్లాదేశ్ మూడు వికెట్లకు 107 పరుగులు చేసింది. ఈ సమయంలో.. బంగ్లాదేశ్ లంచ్ తర్వాత సెషన్‌లో తొమ్మిది ఓవర్లలో 33 పరుగులు చేసింది. క్రీజులో మోమినుల్ హక్ (40*), ముష్ఫీకర్ రహీం (6*) క్రీజులో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.

https://twitter.com/gharkekalesh/status/1839578031423394301

Exit mobile version