Site icon NTV Telugu

Shikhar Dhawan : సీరియల్స్ బాట పట్టిన క్రికెటర్.. టీమిండియాలో చోటు కోల్పోయిన గబ్బర్..

Shikar Dhawan

Shikar Dhawan

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పోటీపడిన టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్.. ఇప్పుడు టీమ్ లో చోటు కోల్పోయాడు. వాస్తవానికి ఐసీసీ టోర్నీల్లో కోహ్లీ, రోహిత్ కంటే మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉన్న ధావన్ ను బీసీసీఐ కావాలనే సైడ్ చేసినట్లు కనిపిస్తుంది. ఐదు నెలల క్రితం టీమిండియా ఆడిన వన్డే సిరీస్ లకు కెప్టెన్ గా వ్యవహారించిన శిఖర్ ధావన్, ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ టీమ్ లో చోటు దక్కించుకోలేకపోయాడు.

Also Read : IND vs AUS : మూడో వన్డేకు భారత జట్టులో కీలక మార్పులు.. సూర్యకు లాస్ట్ ఛాన్స్

టీమిండియాకు దూరమైన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2023 సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ఐపీఎల్ కి ఇంకా సమయం ఉండడంతో గ్యాప్ లో ఓ హిందీ సీరియల్ లో నటిస్తూ గబ్బర్ బీజీగా గడుపుతున్నాడు. ఓ న్యూస్ ఛానెల్ లో ప్రసారమయ్యే హిందీ సూపర్ హిట్ సీరియల్ లో ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నా.. క్రికెటర్ శిఖర్ ధావన్ ఓ పోలీస్ డ్రెస్సులో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read : Budget : అదానీ వ్యవహారంపై విపక్షాల ఆందోళన.. మధ్యాహ్నం 2 గంటలకు లోక్ సభ వాయిదా

గబ్బర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఫోటోలు బయటికి వచ్చినా అతను ఐపీఎల్ 2023 ప్రోమోలో ఇలా కనిపించబోతున్నాడేమోనని అనుకున్నారంతా.. అయితే సీరియల్ లో నటించబోతున్నాడని తెలిసి గబ్బర్ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు. ఐదు నెలల క్రితం టీమిండియాకి వన్డే కెప్టెన్ గా వ్యవహరించిన శిఖర్ ధావన్, ఇప్పుడు సీరియల్ నటుడిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read : Love Marriage : 92 ఏళ్ల వయస్సులో ప్రేమ.. త్వరలోనే ఆమెతో పెళ్లి..

యంగ్ బ్యాటర్ శుబ్ మన్ గిల్ అద్బుతమైన నిలకడ చూపిస్తూ వన్డేల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. గిల్ పర్ఫామెన్స్ కారణంగా శికర్ ధావన్, వన్డేల్లతో కూడా చోటు కోల్పోయాడు. టెస్టు మ్యాచ్ ఆరంగ్రేటం మ్యాచ్ లోనే 187 పరుగులు చేసి రికార్డ్ క్రియేట్ చేసిన శిఖర్ ధావన్, తన క్రికెట్ కెరీర్ లోనే ఎన్నో రికార్డులు సృష్టించాడు.
2022లో బంగ్లాదేశ్ తో జరిగిని వన్డే సిరీస్ లో ఆడిన శిఖర్ ధావన్.. ఆ తర్వాత టీమ్ లో చోటు కోల్పోయాడు. నిలకడగా రాణిస్తున్న శుబ్ మన్ గిల్ ని వన్డేల్లో ఫిక్స్ చేసిన టీమిండియా మేనెజ్మెంట్, శిఖర్ ధావాన్ ని సైడ్ చేసేసింది.

Exit mobile version