NTV Telugu Site icon

Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ లవ్లీనా ఓటమి..

Loveleena

Loveleena

టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్, పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు మించి వెళ్లలేకపోయింది. పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గెన్ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్-1 బాక్సర్ లీ కియాన్ చేతిలో 1-4 తేడాతో ఓటమి పాలయ్యారు.

Read Also: Anam Ramanarayana Reddy: టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని జలాశయాలు నిండి పోయాయి..

లోవ్లినా 16వ రౌండ్‌లో నార్వేకు చెందిన సున్నివా హాఫ్‌స్టాడ్‌ను ఓడించి చివరి ఎనిమిది దశకు చేరుకుంది. కాగా.. ఇప్పుడు క్వార్టర్స్ లో ఓడిపోవడంతో భారత్ బాక్సింగ్ బృందం పారిస్ నుండి పతకం లేకుండా తిరిగి రానుంది. కాగా టోక్యో ఒలింపిక్స్లో లవ్లీనా బ్రాంజ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.. ఇదిలా ఉంటే.. శనివారం బాక్సింగ్‌లో నిశాంత్ దేవ్ కూడా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోవడంతో భారత్‌ సవాల్‌ ముగిసింది.

Read Also: Rachakonda CP: చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని.. ప్రోత్సహించే వారిని ఉపేక్షించం..

Show comments