Site icon NTV Telugu

Operation Sindoor: ఉదయం 10 గంటలకు భారత్ సైన్యం మీడియా సమావేశం..

Army

Army

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. మర్కజ్ సుభాన్ అల్లా బహవల్పూర్, మర్కజ్ తైబా, మురిద్కే, సర్జల్, టెహ్రా కలాన్, మెహమూనా జోయా ఫెసిలిటీ, సియాల్‌కోట్, మర్కజ్ అహ్లే హదీస్ బర్నాలా, భీంబర్, మర్కజ్ అబ్బాస్, కోట్లి, మస్కర్ రహీల్ షాహిద్, ముజఫరాబాద్‌లోని షావాయి నల్లా క్యామ్, మర్కజ్ సయ్యద్నా బిలాల్ లో మెరుపు దాడులు చేసింది. పహల్గాంలో అమాయకపు పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటోంది.

Also Read:Jaish-e-Mohammed Base Camp: ఆపరేషన్ సింధూర్.. జైషే మహమ్మద్ స్థావరాలు ధ్వంసం..

‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ విజయవంతగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. నేడు ఉదయం 10 గంటలకు భారత్ సైన్యం మీడియా సమావేశం నిర్వహించనుంది. మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించనుంది భారత్ సైన్యం. ఆపరేషన్ సింధూర్” విజయవంతం తర్వాత ఆర్మీ, వైమానిక, నావికదళ చీఫ్‌లతో రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ మాట్లాడారు. “ఆపరేషన్” తీరుతెన్నులు, భవిష్యత్తు వ్యూహంపై త్రివిధ దళాధిపతులతో చర్చించారు. భారత్-పాక్ సరిహద్దుల్లోని పరిస్థితులను త్రివిధ దళాలు నిశితంగా గమనిస్తు్న్నాయి. రక్షణ శాఖ అధికారులు రక్షణ రంగ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

Exit mobile version