Site icon NTV Telugu

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ లోగోను రూపొందించింది వీరే

Operation Sindoor

Operation Sindoor

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత సైన్యం పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించింది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్ కు తగిన బుద్ధి చెప్పింది. పాకిస్తాన్‌పై భారత్ తీసుకున్న చర్య గురించి చర్చతో పాటు, ఈ ఆపరేషన్ లోగో రూపకల్పన కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపింది. కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ లోగో ఎవరు రూపొందించి ఉంటారబ్బా అని సెర్చ్ చేయడం ప్రారంభించారు.

Also Read:Bhatti Vikramarka: స్వామి ఆశీస్సులతోనే నేను ఈస్థాయిలో ఉన్నా!

అయితే ఈ లోగోను రూపొందించింది అడ్వర్టైసింగ్ ప్రొఫెషనల్స్, బ్రాండింగ్ కంపెనీలు అనుకుంటే పొరపాటే. ఈ లోగోను ఇద్దరు భారత ఆర్మీ సైనికులు రూపొందించారు. ఆపరేషన్ సిందూర్ లోగోను లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ గుప్తా, హవల్దార్ సురీందర్ సింగ్ రూపొందించారు. ఈ లోగో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. మే 7న, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఒక ఆపరేషన్ ప్రారంభించింది. లక్షిత దాడులు జరిగిన వెంటనే, భారత సైన్యం సోషల్ మీడియాలో ఆపరేషన్ సిందూర్ గురించి వెల్లడిస్తూ ఒక పోస్ట్ పోస్ట్ చేసింది.

Also Read:Bank holidays in June: జూన్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?

ఈ పోస్ట్ ద్వారా ఆపరేషన్ సింధూర్ లోగోను కూడా బహిరంగపరిచారు. ఆపరేషన్ సింధూర్ లోగోను మొదట సోషల్ మీడియాలో మే 7న తెల్లవారుజామున 1.51 గంటలకు పోస్ట్ చేశారు. లోగోలో త్యాగం, జాతీయ గర్వాన్ని సూచించే సింధూర గిన్నె ఉంటుంది. సిందూరంలోని “O” అనేది సాంప్రదాయ సింధూర గిన్నె నుంచి తీసుకున్నారు. ఇది వివాహిత హిందూ మహిళల పవిత్ర చిహ్నం. దాని ముదురు ఎరుపు రంగు త్యాగం, న్యాయం, జాతీయ గర్వం గురించి చెబుతుంది.

Exit mobile version