Site icon NTV Telugu

Manipur: మణిపూర్‌లో మరో ఆర్మీ ఆఫీసర్ కిడ్నాప్

Army

Army

మణిపూర్‌లో (Manipur) అధికారుల కిడ్నాప్‌ల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరొక ఆర్మీ అధికారి కిడ్నాప్‌కు గురయ్యారు. మణిపూర్‌లో ఇది నాల్గో సంఘటన కావడం విశేషం.

మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాకు చెందిన జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ కొన్సమ్ ఖేదా సింగ్‌ను శుక్రవారం ఉదయం 9 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో వచ్చి ఇంట్లో ఉన్న ఆఫీసర్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.

మణిపూర్‌లో గత ఏడాది మేలో సరిహద్దు రాష్ట్రంలో జాతి హింస ప్రారంభమైనప్పటి నుంచి అధికారి కిడ్నాప్ కావడం ఇది నాల్గోది. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. జాతీయ రహదారిపై అన్ని వాహనాలను తనిఖీ చేస్తు్న్నారు. ఎవరు కిడ్నాప్ చేశారో ఇంకా తెలియలేదని అధికారులు తెలుపుతున్నారు.

Exit mobile version