NTV Telugu Site icon

Indian Army: భారత సైన్యానికి 62,500 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు.. టెండర్లు జారీ

Indian Army

Indian Army

Indian Army: భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ తాజాగా నిర్ణయించింది. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ ట్రూప్ సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా 62,500 లెథల్ స్టీల్ కోర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొనుగోలుకు ఇండియన్ ఆర్మీ తాజాగా టెండర్లు పిలిచింది. రక్షణ మంత్రిత్వ శాఖ మేక్ ఇన్ ఇండియా కింద ఈ జాకెట్ల కోసం రెండు వేర్వేరు టెండర్లను జారీ చేసింది. ఇందులో ఒకటి సాధారణ మార్గంలో 47,627 జాకెట్లు, మరొకటి అత్యవసర సేకరణ ప్రక్రియల కింద 15,000 జాకెట్ల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. ఇది రాబోయే మూడు, నాలుగు నెలల్లో ఖరారు చేయబడుతుందని ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. 47,627 జాకెట్ల కొనుగోలు దశలవారీగా జరుగుతుందని, వచ్చే 18-24 నెలల్లో పూర్తవుతుందని వారు తెలిపారు.

మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 12 నుంచి 24 నెలల కాలంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వశాఖ దశలవారీగా టెండర్లు ఆహ్వానించింది. ఆర్మీ జాబితా చేసిన స్పెసిఫికేషన్స్ ప్రకారం ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు 7.62 మిల్లీమీటర్ల ఆర్మర్ పియర్సింగ్ రైఫిల్ మందుగుండు సామగ్రితో పాటు 10 మీటర్ల దూరం నుంచి కాల్చే స్టీల్ కోర్ బుల్లెట్‌ల నుంచి సైనికుడిని రక్షించగలగాలి. ఒక్కో జాకెట్ 10 కిలోల కంటే తక్కువ బరువు ఉండాలని సూచించారు. భారత సైన్యంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొరత చాలా సంవత్సరాలుగా ఉంది. భారత సైనికుల శరీర రక్షణ కోసం నాణ్యమైన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వశాఖ సమాయత్తమైంది.

Gujarat Elections: ఎన్నికల ముంగిట బీజేపీ కీలక నిర్ణయం.. ఏడుగురు రెబల్స్‌పై వేటు

కాశ్మీర్ లోయలో జరిగిన కొన్ని సంఘటనలలో, ఉగ్రవాదులు భారత భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్లలో అమెరికన్ కవచాన్ని ఛేదించే బుల్లెట్లను ఉపయోగించారు. సైనికుల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ఉల్లంఘించడంలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో అన్ని వేళల్లో తట్టుకునేలా ఈ బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ఉండాలని అధికారులు సూచించారు. ఈ రెండు టెండర్ల ద్వారా సేకరించిన జాకెట్లు లెవల్ 4గా ఉంటాయి, ఇవి స్టీల్ కోర్ బుల్లెట్‌లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేయనున్నాయి. మొదట జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలలో మోహరించిన సైనికులకు అందించబడతాయి. ఈ జాకెట్లు భారత్‌లోనే తయారు చేయబడుతున్నాయని ఆర్మీ వర్గాలు ధ్రువీకరించాయి.

Show comments