Site icon NTV Telugu

Aircraft Crash: కూలిన వాయుసేన శిక్షణ విమానం.. పైలట్లు సేఫ్

Aircraft Crash

Aircraft Crash

Aircraft Crashes In Karnataka : భారత వైమానిక దళానికి చెందిన వాయుసేన శిక్షణ విమానం ప్రమాదానికి గురయింది. భార‌త వైమానిక ద‌ళానికి చెందిన కిర‌ణ్ శిక్షణ విమానం క‌ర్ణాట‌క‌లో నేల‌కూలింది. కర్ణాటకలోని చామ‌రాజ‌న‌గ‌ర్‌లోని మాకాలి గ్రామంలో విమానం క్రాష్ అయ్యింది. అయితే ఆ విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు పారాచూట్ల సాయంతో క్షేమంగా బయటపడినట్లు తెలిసింది.ఇద్దరు పైలెట్లలో ఒకరు మహిళా పైలట్‌ ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు విచారణకు ఆదేశించారు.

Read Also: IPL: ఐపీఎల్‌ చూడ్డం టైమ్‌ వేస్ట్‌ : స్టార్టప్ ఫౌండ‌ర్‌ తనయ్ ప్రతాప్‌

రోజువారీ శిక్షణ కార్యకలాపాల్లో భాగంగా వాయుసేనకు చెందిన కిరణ్‌ శ్రేణి విమానం బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే చామరాజనగర్‌కు సమీపంలోని బోగాపుర గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో విమానం కూలిపోయింది. ఇద్దరు పైలట్లు తేజ్‌పాల్‌, భూమిక స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై వాయుసేన అధికారులు విచారణకు ఆదేశించారు.

Exit mobile version