Site icon NTV Telugu

Indian Air Force : ముగిసిన రఫెల్ డీల్.. ఇండియాకు చేరుకున్న ఆఖరి విమానం

Rafel

Rafel

Indian Air Force : ఇండియా, ఫ్రాన్స్ మధ్య కుదిరిన రఫెల్ డీల్ ముగిసింది. భారత నౌకాదళానికి సరికొత్త ఆయుధ సంపత్తిని చేర్చాలని సుమారు 9 బిలియన్ డాలర్ల విలువైన రాఫెల్ ఒప్పందాన్ని ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం చేసుకుంది. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందం జరుగగా.. ఐదు రాఫెల్ జైట్‌ విమానాలు జూలై 2020న తొలి బ్యాచ్ అంబాలాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరాయి. రఫేల్ యుద్ధ విమానాల్లో చివరిదైన 36వ ఎయిర్​క్రాఫ్ట్ గురువారం భారత్​కు చేరింది.

Read Also: Artificial Womb: ఇక కోళ్లను పెంచినట్లు గర్భాలను పెంచొచ్చు

ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా అన్ని విమానాల డెలివరీని పూర్తి అయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ‘ది ప్యాక్ కంప్లీట్’ అని ట్వీట్ చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్ అనే సంస్థ ఈ రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. ఆ దేశంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా భారత్‌కు డీల్ ప్రకారం 36 విమానాలు భారత్ కు అందాయి. కాగా, ఒక్కో జెట్‌కు రూ. 670 కోట్లుగా అంచనా వేశారు. ఈ రాఫెల్ ఫైటర్ జెట్లలో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. హెల్మెట్-మౌంటెడ్ సైట్, రాడార్ వార్నింగ్ రిసీవర్‌లు, డేటా రికార్డర్స్, ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్, ట్రాక్ సిస్టమ్, టోవ్డ్ డికాయ్స్, మిస్సైల్ అప్రోచ్ వార్నింగ్ బెల్స్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version