Site icon NTV Telugu

Ind vs Ned: టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌.. ఇక పరుగుల వరదేనా?

Ind Vs Ned

Ind Vs Ned

Ind vs Ned: గురువారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ సూపర్-12లో నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్‌లో విజయం ఉత్సాహాన్నిస్తుంటే.. రెట్టించిన ఉత్సాహంతో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో గురువారం నెదర్లాండ్స్‌తో మైదానంలోకి టీమిండియా దిగింది. ఈ నేపథ్యంలో టీమిండియా తన విజయాల జోరును కొనసాగించాలని చూస్తుంది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఏ ఆటగాడికి విశ్రాంతి ఇవ్వడం లేదని, జట్టు సాధ్యమైనంత వరకు ఉత్తమంగా ఆడుతుందని స్పష్టం చేశారు.

SA vs Ban: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సెంచరీతో చెలరేగిన రిలీ రోసో

ఇప్పటివరకు అంతర్జాతీయ టీ-20ల్లో తలపడని భారత్, నెదర్లాండ్‌ జట్లు.. ప్రపంచ కప్ వేదికగా మొదటిసారి ఆడుతున్నాయి. పసికూనపై భారత్‌ తమ సత్తా చాటుతుందని భావిస్తున్నా.. డచ్‌ జట్టు కూడా ఏ మాత్రం తీసిపోకుండా సంచలనం కోసం ప్రయత్నిస్తోంది. శ్రీలంక చేతిలో ఓడిన నెదర్లాండ్స్‌ తమ ప్రదర్శనను మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉంది. బలాబలాలు చూస్తే మాత్రం రోహిత్‌సేన హాట్ ఫేవరెటే. మ్యాక్స్‌ ఒ డౌడ్, విక్రమ్‌జిత్‌ సింగ్, అకర్‌మన్, టామ్‌ కూపర్‌ నెదర్లాండ్స్‌ జట్టులో కీలక ఆటగాళ్లు. కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ ముందుండి స్ఫూర్తిదాయకంగా జట్టును నడిపిస్తున్నాడు. ప్రధాన బౌలర్‌ మీర్‌కెరెన్‌ ఫామ్‌లో ఉన్నాడు.
భారత్ బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోరు చేయడానికి ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనర్లుగా రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ క్రీజులోకి దిగారు. భారత బ్యాట్స్‌మెన్‌ల దూకుడును చూసేందుకు క్రీడాభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

Exit mobile version