NTV Telugu Site icon

IND vs SA: టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన భారత్.. మ్యాచ్ సమం అవుతుందా?

Ind Vs Sa

Ind Vs Sa

భారత్ దక్షిణాఫ్రికా మధ్య నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ శుక్రవారం జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లలో ఎలాంటి మార్పులు లేవు. నాలుగు టీ20ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుకు సిరీస్‌ను కైవసం చేసుకునే సువర్ణావకాశం ఉండగా.. సిరీస్‌ను సమం చేసేందుకు దక్షిణాఫ్రికా యత్నిస్తోంది. మొదటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. రెండో టీ20లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. మూడో మ్యాచ్‌ను భారత్ కైవసం చేసుకుంది. అయితే గత పోరులో 11 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. సంజు శాంసన్, తిలక్‌ వర్మల శతకాలు సిరీస్‌లో ఆ జట్టును ముందంజలో నిలిపాయి కానీ.. జట్టుగా బ్యాటుతో ప్రదర్శన గొప్పగా లేదు. జట్టు సమష్టిగా మెరవాల్సిన అవసరం ఉంది.

సౌతాఫ్రికా తుది జట్టు..
ర్యాన్ రికెల్‌టన్, రీజా హెండ్రిక్స్, ఐదెన్ మార్‌క్రమ్ (కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ, సిమోలన్‌, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా.

టీమ్‌ఇండియా తుది జట్టు..
సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్య, రింకు సింగ్, రమణ్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.