NTV Telugu Site icon

India vs Bangladesh 3rd T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Ibdia

Ibdia

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత జట్టు తలపడనుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సూర్య కుమార్‌ యాదవ్ సారథ్యంలో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయదుందుభి మోగించింది. తాజాగా టీంలో మార్పు చోటుచేసుకుంది. పేసర్ అర్ష్‌దీప్ స్థానంలో రవి బిష్ణోయ్‌కి అవకాశం దక్కింది. వైరల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా హర్షిత్ రాణా మూడవ టీ20కి హాజరుకాలేదు. ఈ మేరకు బీసీసీఐ సమాచారం ఇచ్చింది. హర్షిత్ కు ఇన్ ఫెక్షన్ సోకడంతో హోటల్ నుంచి స్టేడియానికి రాలేకపోయాడు. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో దసర పండగ రోజు విజయాల జోరు కొనసాగించేందుకు టీమిండియా కుర్రాళ్లు సై అంటున్నారు.

READ MORE: Pakistan: కరాచీ దాడికి పాల్పడింది బీఎల్‌ఏ.. విదేశీ గూఢచార సంస్థతో సంబంధం..

టీం ఇదే.. సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, మే బిక్నోరి, రవిష్ణోరి యాదవ్..

Show comments