Site icon NTV Telugu

IND Vs SA: మూడో టీ20లో మూడు మార్పులు చేసిన టీమిండియా.. తొలుత దక్షిణాఫ్రికా బ్యాటింగ్

Ind Vs Sa

Ind Vs Sa

IND Vs SA: ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఏకంగా మూడు మార్పులు చేసింది. టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చింది. వీరి స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఉమేష్ యాదవ్‌లకు చోటు కల్పించింది. అటు యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా పక్కనబెట్టి అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను తీసుకుంది.

అటు దక్షిణాఫ్రికా కూడా ఓ మార్పు చేసింది. పేస్ బౌలర్ అన్రిచ్ నోర్జ్ స్థానంలో ఆల్‌రౌండర్ ప్రిటోరియస్‌ను తీసుకుంది. కాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇప్పటికే టీమిండియా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇది నామమాత్రపు మ్యాచ్ కావడంతో భారత్ పలు మార్పులు చేసింది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాతోనే మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్‌పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.
దక్షిణాఫ్రికా: డికాక్, బవుమా, రోసౌ, మార్‌క్రమ్, మిల్లర్, స్టబ్స్, పార్నెల్, రబాడ, కేశవ్ మహరాజ్, ప్రిటోరియస్, లుంగీ ఎంగిడి

Exit mobile version