NTV Telugu Site icon

IND-W vs NEP-W: ఆసియా కప్లో భారత్ మూడో విజయం.. నేపాల్పై విక్టరీ

Ind W

Ind W

మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్-నేపాల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. వరుసగా మూడో మ్యాచ్లో గెలిచింది భారత్. 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్లో ఓపెనర్లు మంచిగా రఫ్పాడించారు. షఫాలీ వర్మ అత్యధికంగా (81) పరుగులు చేసింది. ఆ తర్వాత.. డయాలాన్ హేమలత (47) రన్స్ సాధించారు. జెమిమా రోడ్రిగ్స్ (28*), సజీవన్ సజనా (10) పరుగులు చేశారు. నేపాల్ బౌలింగ్లో సీతా రాణా మగార్ 2 వికెట్లు పడగొట్టింది. కబితా జోషి ఒక వికెట్ తీసింది.

Read Also: Pradeep Bhandari: బీజేపీ జాతీయ ప్రతినిధిగా జర్నలిస్ట్ ప్రదీప్ నియామకం

ఆ తర్వాత.. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. నేపాల్ బ్యాటింగ్లో అత్యధికంగా సీతా రాణా మగార్ (18) పరుగులు చేసింది. ఆ తర్వాత ఇందు బర్మా (14), రుబీనా శెట్టి (15), బిందూ రావల్ (17), సంజనా ఖడ్కా (7) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అత్యధికంగా దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత.. రాధా యాదవ్, అరుంధతీ రెడ్డి తలో రెండు వికెట్లు పడగొట్టారు. రేణుకా సింగ్కు ఒక వికెట్ దక్కింది. భారత్ ఈ విజయంతో సెమీస్కు దూసుకెళ్లింది.

Read Also: INDIA Bloc: ఇండియా కూటమి కీలక నిర్ణయం.. ఉభయ సభల్లో రగడ తప్పదా?