IND Women vs WI Women: టీమిండియా, వెస్టిండీస్ మహిళల మధ్య వడోదరలో జరిగిన వన్డే సిరీస్ మూడో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడించి, సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేసిన భారత జట్టు, వెస్టిండీస్‌ను కేవలం 162 పరుగులకే కట్టడి చేసింది. ఆ తరువాత, భారత బ్యాట్స్‌మెన్ ఈ సులభమైన లక్ష్యాన్ని కేవలం 28.2 ఓవర్లలో ఛేదించారు. దీప్తి శర్మ ఈ మ్యాచ్‌లో అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. దాంతో ఆమెను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకుంది.
Also Read: Parenting Tips: పిల్లలతో ఇలా ఉంటే చిన్నప్పటి నుండే సక్రమ మార్గంలో పయనిస్తారు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్లు రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మలు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి, జట్టు మొత్తాన్ని 162 పరుగులకే పరిమితం చేశారు. మొదటి బంతికే వెస్టిండీస్‌కు రేణుకా షాక్ ఇచ్చింది. 9 పరుగుల వద్ద మూడో వికెట్ పడగొట్టిన రేణుకా ఆ తర్వాత కరీబియన్ జట్టును కంట్రోల్ చేయడం కొనసాగించింది. ఆ తర్వాత దీప్తి శర్మ మిగిలిన వికెట్లను వరుసబెట్టి 10 ఓవర్లలో 31 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది.
Also Read: Chayote Health Benefits: సీమ వంకాయ గురించి విన్నారా.. తింటే ఇన్ని లాభాలా?
ఇక భారత బ్యాటింగ్ ప్రారంభంలో కొన్ని వికెట్లు కోల్పోయినప్పటికీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (32), జెమిమా రోడ్రిగ్స్ (29) నెమ్మదిగా పరుగులు సాధించారు. దీప్తి శర్మ 48 బంతుల్లో 39 పరుగులు చేసి, రిచా ఘోష్ 11 బంతుల్లో 23 పరుగులు చేసిన తర్వాత భారత్ ఈ లక్ష్యాన్ని 28.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్ తో భారత్-వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌లో భారత్ మూడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో భారత్ 211 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో 115 పరుగుల తేడాతో విజయం సాధించగా, మూడో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రేణుకా సింగ్ ఠాకూర్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో మొత్తం 10 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా భారత్ వెస్టిండీస్‌పై 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.