NTV Telugu Site icon

Asian Games 2023: భారత్‌ ఖాతాలో మరో రజతం.. 16కు చేరిన మొత్తం పతకాల సంఖ్య!

Untitled Design (3)

Untitled Design (3)

India Wins Silver Medal in Asian Games 2023: హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. 50 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ విభాగం (3 పొజిషన్స్‌)లో భారత మహిళా జట్టు రజతం (సిల్వర్‌ మెడల్‌) సాధించింది. భారత షూటింగ్‌ త్రయం సిఫ్ట్‌కౌర్‌ సమ్రా, మనిని కౌశిక్‌, ఆషి చోక్సీ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు రజతం దక్కింది. అదే సమయంలో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల అర్హతలో సిఫ్ట్‌కౌర్‌ రెండవ స్థానంలో, చోక్సీ ఆరో స్థానంలో నిలిచారు.

బుధవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్‌ విభాగంలో చైనా జట్టు స్వర్ణ పతకం సాధించింది. చైనా 1773 పాయింట్లు సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. చైనా కంటే 9 పాయింట్లు వెనుకబడిన భారత జట్టు 1764 స్కోరుతో రజతం సాధించింది. రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా 1756 స్కోరు సాధించి.. మూడో స్థానములో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది.

Also Read: IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. ప్రపంచ రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ!

భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 25 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ గోల్డ్ మెడల్ సాధించింది. భారత షూటర్లు మనూ బాకర్‌, రిథం సంగ్వాన్‌, ఇషా సింగ్‌ భారత్‌ ఖాతాలో పసిడి చేర్చారు. నాలుగో రోజు పతకాలు కలుపుకుని భారత్‌ పతకాల సంఖ్య 16కు చేరింది. భారత క్రీడాకారులు ఇప్పటివరకు నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్యాలు సాధించారు.

Show comments