NTV Telugu Site icon

T20 World Cup 2024: పాకిస్తాన్ ఓటమి.. భారత్‌ ఇంటికి!

India Women

India Women

India Women Out From T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయింది. దాయాది పాక్ 11.4 ఓవర్లలో 56కే ఆలౌట్‌ అవ్వడంతో 54 పరుగులతో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. ఈ ఓటమితో పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. దాయాది పాక్ ఓటమితో భారత్‌ సెమీస్‌ ఆశలు కూడా గల్లంత్తయ్యాయి. న్యూజిలాండ్‌ దెబ్బకు దాయాది దేశాలు ఇంటిదారి పట్టాయి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 110 పరుగులు చేసింది. సుజీ బేట్స్‌ (28) టాప్ స్కోరర్ కాగా.. జార్జియా ప్లిమ్మర్‌ (17), సోఫి డివైన్‌ (19), బ్రూక్‌ హ్యాలీడే (22) పరుగులు చేశారు. పాక్ బౌలర్ నష్రా సంధు మూడు వికెట్లు పడగొట్టింది. లక్ష్య ఛేదనలో చతికిలపడ్డ పాకిస్థాన్‌ 11.4 ఓవర్లలో 56కే ఆలౌట్‌ అయింది. ఫాతిమా సనా (21) పరుగులు చేసింది. మునీబా అలీ (15) తప్ప మరే బ్యాటర్ రెండంకెల స్కోర్ అందుకోలేదు. అమేలియా కెర్ మూడు వికెట్స్ తీసింది.

Also Read: Monkey Viral Video: ‘మామ ఏక్ పెగ్ లా’ అంటూ.. బీరేసిన కోతి!

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో గ్రూప్‌-ఏ నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆసీస్ నాలుగింటికి నాలుగు గెలిచింది. కివీస్ నాలుగు మ్యాచులలో మూడు గెలిచి.. సెమీస్‌కు చేరుకుంది. ఆడిన నాలుగు మ్యాచులలో రెండు గెలిచిన భారత్ ఇంటిదారి పట్టింది. పాక్ ఒక విజయం మాత్రమే సాధించింది. శ్రీలంక అన్ని మ్యాచులలో ఓడింది. గ్రూప్‌-బీలో ఇంకా సెమీస్ బెర్త్‌లు ఖరారు కాలేదు.

Show comments