India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Zimbabwe: జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌కు భారత్ సిద్ధమవుతున్న వేళ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి తీవ్రమైన పరీక్ష ఎదురవుతోంది. నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓటమి పాలైంది. కనీసం టాస్‌లు గెలిచినా, విజయాలు మాత్రం లభించలేదు. ఐర్లాండ్‌పై 0-2తో, ఇంగ్లండ్‌పై 0-4తో సిరీస్‌లను కోల్పోయిన టీమ్ ఇండియాకు, ఐర్లాండ్ కంటే బలంగా ఉన్న జింబాబ్వేను ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది. జూలై 23 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో బోణీ కొట్టాలని అయ్యర్ ఆరాటపడుతున్నాడు.
ఇంగ్లండ్ పర్యటనలో ఆల్ రౌండర్ సామ్ కరన్ బౌలింగ్, బ్యాటింగ్‌తో భారత జట్టును దెబ్బతీశాడు. టీ20ల్లో 7 వికెట్లు, వన్డేల్లో 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ సిరీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు జింబాబ్వే పర్యటనలో అతని పెద్ద అన్నయ్య బెన్ కరన్ రూపంలో టీమ్ ఇండియాకు కొత్త భయం పట్టుకుంది. ఇప్పటికే జింబాబ్వే తరఫున టెస్టులు, వన్డేల్లో ఓపెనర్‌గా రాణించిన బెన్ కరన్, ఇప్పుడు భారత్‌పై టీ20 అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
ఇంగ్లండ్ తరఫున ఆడే అవకాశం రాకపోవడంతో, బెన్ కరన్ 2024లో జింబాబ్వేకు మారాడు. నిజానికి తన తండ్రి కెవిన్ కరన్ జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడటంతో, బెన్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ జింబాబ్వే జెర్సీ ధరించాడు. అతని చిన్న తమ్ముడు సామ్ కరన్ ఇంగ్లండ్‌కు ఆడుతూ భారత్‌ను దెబ్బతీయగా, ఇప్పుడు పెద్ద తమ్ముడు బెన్ కరన్ జింబాబ్వే తరఫున భారత్‌కు ఎలాంటి సవాలు విసురుతాడోనని క్రీడాభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!