Site icon NTV Telugu

IND vs ZIM: జింబాబ్వేతో రెండో టీ-20.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Ind Vs Zim

Ind Vs Zim

IND vs ZIM: భారత్‌, జింబాబ్వే జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ హరారే వేదికగా జరుగుతోంది. టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. తొలి టీ-20 మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో షాక్‌ తిన్న భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉంది. జింబాబ్వే బౌలర్లను తేలిగ్గా తీసుకున్నారో, పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయారో కానీ తొలి మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తేలిపోయారు. ఈ ముగ్గురు యువ బ్యాటర్లు తొలి టీ20 లో విఫలమయ్యారు. అభిషేక్ శర్మ డకౌట్ కాగా.. పరాగ్ రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఇక ధృవ్ జురెల్ 14 బంతులాడి 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన ఈ ముగ్గురు తమ అంతర్జాతీయ తొలి మ్యాచ్‌లో విఫలమయ్యారు. రెండో టీ20లో భారత తుది జట్టులో ఓ మార్పు జరిగింది. ఖలీల్ అహ్మద్ స్థానంలో సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

Read Also: Bharath Wrestler: కెరీర్‌లో మూడోసారి బంగారు పతకాన్ని గెలుచుకున్న భరత్ రెజ్లింగ్ ఛాంపియన్

భారత తుది జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, రుతురాజ్‌ గైక్వాడ్, సాయి సుదర్శన్‌, రియాన్ పరాగ్, రింకు సింగ్, ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్‌, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్.

జింబాబ్వే తుది జట్టు ఇదే..
వెస్లీ మద్వీర, ఇన్నోసెంట్ కైయా, బ్రియన్ బెనెట్, సికిందర్ రజా (కెప్టెన్‌), డియోన్ మైయర్స్‌, జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మండాడే (వికెట్ కీపర్‌), మసకద్జ, జాంగ్వి, ముజరబాని, చటార.

Exit mobile version