NTV Telugu Site icon

India vs Srilanka: శ్రీలంకతో నేడు అమీతుమీ

India Vs Srilanka

India Vs Srilanka

India vs Srilanka: భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో నేడు నిర్ణయాత్మక పోరు జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు అయ్యేసరికి రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ టీ-20 సిరీస్‌లో ఆఖరిపోరుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. గత మ్యాచ్ ఫలితం చూస్తే మెరుగైన జట్టు ఏది అంటే శ్రీలంక అనే చెప్పాలి. కోహ్లీ, రోహిత్, రాహుల్, షమి, భువనేశ్వర్ లాంటి సీనియర్లు టీ20 జట్టుకు దూరమైన స్థితిలో కుర్రాళ్లతో నిండిన జట్టు.. హార్దిక్ నాయకత్వంలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. హార్దిక్ సారథ్యంలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన జట్టు నిలకడగా ఆగి విజయతీరాలకు చేరుతుందో లేదో చూడాలి.

తొలి రెండు టీ20ల్లో ఆకట్టుకోలేని యువభారత్ అంతగా ఆకట్టుకోలేదు. వన్డేల ముంగిట ఈ మ్యాచ్‌ నెగ్గి టీ20 సిరీస్‌ను సాధించడం ఇరు జట్లకూ చాలా అవసరం కాబట్టి విజయం కోసం గట్టిగానే పోరాడతాయనడంలో సందేహం లేదు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్ అంతగా ఆకట్టుకోలేదు. తొలి మ్యాచ్‌లో కిషన్‌ రాణించినా పెద్దగా మెరిపించలేకపోయాడు. కీలకమైన ఆఖరి పోరులో ఇద్దరు బాధ్యత తీసుకోవాలి. లేదంటే అది ఇన్నింగ్స్‌పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. సూర్యకుమార్‌ ఫామ్‌లో ఉన్నాడు. అతనిపై జట్టు మేనేజ్‌మెంట్‌కు ఏ బెంగా లేదు. అక్షర్‌ పటేల్‌ రూపంలో అదనపు బ్యాటింగ్‌ బలం కనిపిస్తున్నప్పటికీ రెగ్యులర్‌ బ్యాటర్లు హార్దిక్‌ పాండ్యా, దీపక్‌ హుడా బ్యాట్లకు పనిచెబితేనే లంక బౌలింగ్‌పై పట్టు సాధించవచ్చు. ఇదిలా ఉండగా.. భారత బౌలర్ల ప్రదర్శన జట్టు అంతగా ఏమి అనిపించడం లేదు. రెండో టీ20లో అర్ష్‌దీప్ మాత్రమే కాకుండా.. మిగతా బౌలర్లు చివరి ఓవర్లలో పూర్తిగా తేలిపోయారు. నిర్ణయాత్మక టీ20లో బౌలింగ్ గాడిన పడకుంటే సిరీస్ మీద ఆశలు నిలవడం కష్టమే.

Pakistan Crisis: దివాళా దిశగా పాకిస్తాన్.. పిండి, గ్యాస్, కరెంట్ అన్నీ కష్టాలే..

బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ శ్రీలంక సత్తా చాటుతోంది. శ్రీలంక బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. సిరీస్‌ ఫలితం తేల్చే ఈ మ్యాచ్‌లో జోరు కనబరచాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.