Site icon NTV Telugu

Ind vs SA: నేడు విశాఖలో ఇండియా VS సౌత్ ఆఫ్రికా మ్యాచ్.. విరాట్‌కి కలిసొచ్చిన స్టేడియం మనదే..!

Ind Sa

Ind Sa

India vs South Africa ODI Decider in Vizag: విశాఖ నగరంలో క్రికెట్ సందడి నెలకొంది.. నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండియా, సౌత్ ఆఫ్రికా జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు వన్డే లా సీరీస్ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి.. సీరీస్ డిసైడ్ మ్యాచ్ కావడంతో ఉత్కంఠ నెలకొంది.. కోహ్లీ, రోహిత్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. అందరి దృష్టి రో-కోలపైనే ఉంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకున్నాయి. రెండు టీమ్స్ ప్రాక్టీస్ లో పాల్గొన్నాయి. ఈ మ్యాచ్‌కు పోలీసులు కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.. మరోవైపు.. టికెట్ల విషయంలో అభిమానులకు నిరాశ తప్పడం లేదు. ఆన్ లైన్ టికెట్స్ విక్రయాలపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… స్టేడియం వద్ద బ్లాక్ లో టికెట్స్ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి..

READ MORE: Hyderabad: నగరంలో అర్ధ రాత్రి నుంచి ‘ఆపరేషన్ కవచ్’.. గల్లీల్లోకి 5వేల మంది పోలీసులు..

కాగా.. ఈ మ్యాచ్‌ కోసం విరాట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. విరాట్‌ కోహ్లికి దేశంలో అత్యంత కలిసొచ్చిన స్టేడియం విశాఖ కావడం విశేషం. మన స్టేడియంలో 7 వన్డేలు ఆడిన కోహ్లీ 97.83 సగటుతో 587 పరుగులు చేశాడు. వైజాగ్‌లో అతడు మూడు సెంచరీలు, రెండు అర్ధశతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక్కడ ఆడిన తొలి రెండు వన్డేల్లో అతను శతకాలు సాధించాడు. ప్రస్తుత సిరీస్‌లో వరుసగా రెండు శతకాలు సాధించిన విరాట్‌.. తనకు బాగా కలిసొచ్చిన మైదానంలోనూ సెంచరీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

READ MORE: Akhanda 2: అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన.. రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ..!

Exit mobile version