NTV Telugu Site icon

India vs Pakistan Match Live Updates: 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం

Ind Vs Pak

Ind Vs Pak

India vs Pakistan Match Live Updates: భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ.. దాన్నో మ్యాచ్‌లా కాకుండా ఓ యుద్ధంలా చూస్తారు.. అందుకే దాయాదుల మధ్య పోరు ఎప్పుడు జరిగినా ప్రతీ క్షణం ఉత్కంఠగా సాగుతుంది.. అలాంటి హైఓల్టేజ్‌ మ్యాచ్‌ కి ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మారింది.. ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023లో ఈరోజు హైఓల్టేజ్‌ మ్యాచ్‌ జరుగుతోంది.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది టీమిండియా.. దీంతో.. పాకిస్థాన్‌ బ్యాటింగ్‌కు దిగుతోంది..

The liveblog has ended.
  • 14 Oct 2023 08:08 PM (IST)

    పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం

    ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023: పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం.. 7 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా.. అర్థశతకాలతో చెలరేగిన రోహిత్‌ శర్మ(86), శ్రేయస్‌ అయ్యర్‌(53).

  • 14 Oct 2023 08:04 PM (IST)

    భారత్‌: 186/3 Overs 30

    శ్రేయస్ అయ్యర్: 48
    కేఎల్‌ రాహుల్: 18

  • 14 Oct 2023 08:00 PM (IST)

    భారత్‌: 182/3 Overs 29

    శ్రేయస్ అయ్యర్: 48
    కేఎల్‌ రాహుల్: 14

  • 14 Oct 2023 07:52 PM (IST)

    భారత్‌: 170/3 Overs 27

    శ్రేయస్ అయ్యర్: 45
    కేఎల్‌ రాహుల్: 5

  • 14 Oct 2023 07:38 PM (IST)

    భారత్‌: 161/3 Overs 23

    శ్రేయస్ అయ్యర్: 38
    కేఎల్‌ రాహుల్: 3

  • 14 Oct 2023 07:34 PM (IST)

    భారత్‌: 157/3 Overs 22

    శ్రేయస్ అయ్యర్: 36
    కేఎల్‌ రాహుల్: 1

  • 14 Oct 2023 07:33 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

    ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023: మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. 156 పరుగుల దగ్గర రోహిత్ శర్మ(86) ఔట్. షాహీన్‌ అఫ్రీది వేసిన 21.4వ ఓవర్‌లో రోహిత్ ఔటయ్యాడు.

  • 14 Oct 2023 07:26 PM (IST)

    భారత్‌: 154/2 Overs 21

    రోహిత్ శర్మ: 85
    శ్రేయస్ అయ్యర్: 35

  • 14 Oct 2023 07:24 PM (IST)

    భారత్‌: 142/2 Overs 20

    రోహిత్ శర్మ: 80
    శ్రేయస్ అయ్యర్: 28

  • 14 Oct 2023 07:19 PM (IST)

    భారత్‌: 129/2 Overs 19

    రోహిత్ శర్మ: 68
    శ్రేయస్ అయ్యర్: 27

  • 14 Oct 2023 07:11 PM (IST)

    భారత్‌: 116/2 Overs 16

    రోహిత్ శర్మ: 65
    శ్రేయస్ అయ్యర్: 17

  • 14 Oct 2023 07:04 PM (IST)

    భారత్‌: 111/2 Overs 15

    రోహిత్ శర్మ: 61
    శ్రేయస్ అయ్యర్: 16

  • 14 Oct 2023 06:59 PM (IST)

    భారత్‌: 101/2 Overs 14

    రోహిత్ శర్మ: 52
    శ్రేయస్ అయ్యర్: 15

  • 14 Oct 2023 06:58 PM (IST)

    రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..

    టీమిండియా కెప్టెన్ అర్థ సెంచరీ చేశాడు. 36 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ మంచి ప్రదర్శన చూపిస్తున్నాడు.

  • 14 Oct 2023 06:56 PM (IST)

    భారత్‌: 96/2 Overs 13

    రోహిత్ శర్మ: 49
    శ్రేయస్ అయ్యర్: 13

  • 14 Oct 2023 06:43 PM (IST)

    భారత్‌: 79/2 Overs 10

    రోహిత్ శర్మ: 45
    శ్రేయస్ అయ్యర్: 0

  • 14 Oct 2023 06:42 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

    టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 79 పరుగుల దగ్గర విరాట్‌ కోహ్లీ(16) ఔట్‌ అయ్యాడు. హాసన్ అలీ బౌలింగ్ లో కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు.

  • 14 Oct 2023 06:36 PM (IST)

    భారత్‌: 77/1 Overs 9

    రోహిత్ శర్మ: 44
    విరాట్‌ కోహ్లీ: 15

  • 14 Oct 2023 06:27 PM (IST)

    భారత్‌: 31/1 Overs 7

    రోహిత్ శర్మ: 23
    విరాట్‌ కోహ్లీ: 13

  • 14 Oct 2023 06:13 PM (IST)

    భారత్‌: 31/1 Overs 4

    రోహిత్ శర్మ: 14
    విరాట్‌ కోహ్లీ: 0

  • 14 Oct 2023 06:10 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్

    లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ మంచి ఆరంభాన్ని అందించారు. రెండు ఓవర్లలోనే 20 పరుగులు దాటినప్పటికీ.. షాహిన్ అఫ్రిదీ బౌలింగ్ లో గిల్ పెవిలియన్ కు చేరుకున్నాడు.

  • 14 Oct 2023 06:04 PM (IST)

    శుభారంభం.. మొదటి బంతికే ఫోర్‌

    పాక్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ బరిలోకి దిగింది. 192 పరుగుల లక్ష్య ఛేదన బరిలోకి దిగిన ఓపెనర్‌ రోహిత్ శర్మ మొదటి బంతికి ఫోర్‌ కొట్టి స్కోరును ప్రారంభించాడు. తొలి ఓవర్‌లో భారత్‌ 10 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్‌ ఉన్నారు.

  • 14 Oct 2023 05:28 PM (IST)

    పాక్ 191 పరుగులకే ఆలౌట్..

    వన్డే ప్రపంచకప్ లో భాగంగా.. ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో హైఓల్టేజీ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుని.. పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు పంపించింది. అయితే భారత్ బౌలర్ల విజృంభణతో పాకిస్తాన్ బ్యాటర్లు చెతులేత్తేశారు. నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్తాన్ 191 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజాం(50), రిజ్వాన్(46) రాణించడంతో ఈ మాత్రం పరుగులు చేయగలిగింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ 20, ఇమామ్-ఉల్-హక్ 36 పరుగులు చేశారు.

  • 14 Oct 2023 05:14 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

    పాకిస్తాన్ పై భారత బౌలర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా రవీంద్ర జడేజా బౌలింగ్ లో మరో బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ కు పంపాడు. 40 ఓవర్ల వద్ద హాసన్ అలీ(12) పరుగులు చేసి ఔటయ్యాడు.

  • 14 Oct 2023 05:11 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

    పాకిస్తాన్ జట్టు 8వ వికెట్ కోల్పోయింది. హార్థిక్ పాండ్యా బౌలింగ్ లో మహమ్మద్ నవాజ్ (4) పరుగులు చేసి ఔటయ్యాడు.

  • 14 Oct 2023 05:08 PM (IST)

    పీకల్లోతు కష్టాల్లో పాకిస్థాన్‌

    మొతేరా వన్డేలో పాక్ 7 వికెట్లు కోల్పోయింది. 49 పరుగులకు రిజ్వాన్‌ ఔట్‌ అయ్యాడు. రిజ్వాన్‌ ఔట్‌ కావడంతో పాకిస్థాన్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసే ప్రయత్నాల్లో టీమిండియా ఉంది. ఇదిలా ఉండగా.. భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్, కుల్‌దీప్ తలో రెండు వికెట్లు తీసుకోగా.. పాండ్యా ఒక వికెట్‌ పడగొట్టాడు. ప్రస్తుతం పాక్‌ స్కోరు 39.5 ఓవర్లలో 187/7.

  • 14 Oct 2023 04:54 PM (IST)

    పాకిస్థాన్‌:172/7 (Overs 36)

    మహ్మద్ నవాజ్ : 2
    హసన్‌ అలీ: 1

  • 14 Oct 2023 04:50 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

    పాకిస్తాన్ 7వ వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్ లో షాదాబ్ ఖాన్(2) పరుగులు చేసి ఔటయ్యాడు.

  • 14 Oct 2023 04:47 PM (IST)

    పాకిస్తాన్ కీలక బ్యాట్స్ మెన్ ఔట్.. 49 పరుగులు చేసిన రిజ్వాన్

    భారత బౌలర్ల విజృంభణతో పాకిస్తాన్ బ్యాట్స్ మెన్లు పెవిలియన్ బాట పడుతున్నారు. ఇప్పటిదాకా రిజ్వాన్ ఉన్నంతసేపు జట్టుకు పరుగులు వస్తాయని.. పాక్ అనుకున్నప్పటికీ, ఇప్పుడు అతను కూడా ఔట్ అయ్యాడు. గత ఓవర్ లో వరుసగా రెండు వికెట్లు కోల్పోగా.. తాజాగా రిజ్వాన్ (49) ఔటయ్యాడు. బుమ్రా వేసిన 33 ఓవర్ వద్ద ఔటయ్యాడు.

  • 14 Oct 2023 04:41 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. భారత బౌలర్ల విజృంభణ

    పాకిస్తాన్ పై భారత బౌలర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా మరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీశాడు. మొదటగా సౌధ్ షకీల్ ను ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ పంపించగా.. మరో బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్ ను కూడా ఔట్ చేశాడు.

  • 14 Oct 2023 04:36 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

    ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023: నాలుగో వికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌.. 162 పరుగుల దగ్గర సౌద్‌ షకీల్ (6) ఔట్‌.

  • 14 Oct 2023 04:18 PM (IST)

    మూడో వికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

    పాకిస్థాన్‌ జట్టు మూడో వికెట్‌ కోల్పోయింది. 155 పరుగుల దగ్గర బాబర్ ఆజామ్ (50) ఔటయ్యాడు. సిరాజ్‌ వేసిన 29.4వ ఓవర్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

  • 14 Oct 2023 04:05 PM (IST)

    పాకిస్థాన్‌:131/2 (Overs 27)

    బాబర్‌ ఆజామ్: 37
    మహ్మద్‌ రిజ్వాన్‌: 37

  • 14 Oct 2023 03:46 PM (IST)

    పాకిస్థాన్‌:114/2 (Overs 22)

    బాబర్‌ ఆజామ్: 32
    మహ్మద్‌ రిజ్వాన్‌: 25

  • 14 Oct 2023 03:32 PM (IST)

    పాకిస్థాన్‌:96/2 (Overs 18)

    బాబర్‌ ఆజామ్: 25
    మహ్మద్‌ రిజ్వాన్‌: 14

  • 14 Oct 2023 03:22 PM (IST)

    పాకిస్థాన్‌:79 (Overs 15)

    బాబర్‌ ఆజామ్: 16
    మహ్మద్‌ రిజ్వాన్‌: 6

  • 14 Oct 2023 03:03 PM (IST)

    పాకిస్థాన్ : 68-1 (Overs 12)

    బాబర్ ఆజామ్ : 15
    ఇమామ్ : 32

  • 14 Oct 2023 02:58 PM (IST)

    పాకిస్థాన్ : 60-1 (Overs 11)

    బాబర్ ఆజామ్ : 14
    ఇమామ్ : 25

  • 14 Oct 2023 02:52 PM (IST)

    పాకిస్థాన్: 49-1 (Overs 10)

    బాబర్ ఆజామ్ : 5
    ఇమామ్ : 23

  • 14 Oct 2023 02:48 PM (IST)

    పాకిస్థాన్ : 48-1 (Overs 9)

    బాబర్ ఆజామ్ : 5
    ఇమామ్ : 22

  • 14 Oct 2023 02:44 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్

    ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్.. 8వ ఓవర్ లో సిరాజ్ బౌలింగ్ లో మొదటి వికెట్ కోల్పోయింది. అబ్దుల్లా షఫీక్(20) పరుగులు చేసి ఔటయ్యాడు.

  • 14 Oct 2023 02:34 PM (IST)

    పాకిస్థాన్: 37-0 (Overs 7)

    అబ్దుల్లా : 18
    ఇమామ్ : 18

  • 14 Oct 2023 02:28 PM (IST)

    పాకిస్థాన్ : 28-0 (Overs 6)

    అబ్దుల్లా : 13
    ఇమామ్ : 14

  • 14 Oct 2023 02:23 PM (IST)

    పాకిస్తాన్ : 23-0 (Overs 5)

    అబ్దుల్లా : 10
    ఇమామ్ : 13

  • 14 Oct 2023 02:20 PM (IST)

    పాకిస్తాన్ : 23-0 (Overs 4)

    అబ్దుల్లా : 10
    ఇమామ్ : 13

  • 14 Oct 2023 02:14 PM (IST)

    పాకిస్తాన్ : 17-0 (Overs 3)

    అబ్దుల్లా : 5
    ఇమామ్ : 12

  • 14 Oct 2023 02:10 PM (IST)

    పాకిస్తాన్ : 16-0 (Overs 2)

    అబ్దుల్లా : 4
    ఇమామ్ : 12

  • 14 Oct 2023 02:05 PM (IST)

    పాకిస్తాన్ : 4-0 (Overs 1)

    అబ్దుల్లా : 4
    ఇమామ్ : 0

  • 14 Oct 2023 02:02 PM (IST)

    రెండు జట్లలో ప్లేయింగ్-11

    టీమ్ ఇండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.

    పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీస్ రవూఫ్.