India vs Pakistan: నేడు (డిసెంబర్ 21 ఆదివారం) దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో అండర్-19 ఆసియా కప్ ఫైనల్ జరగనుంది. ఇందులో భారత్ జట్టు పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. ఆదివారం ఉదయం 10:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆయుష్ మాథ్రే నాయకత్వంలో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్ దశలోనే భారత్ పాకిస్థాన్‌ను 90 పరుగుల తేడాతో ఓడించింది. సెమీఫైనల్లో శ్రీలంకపై భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో సులభంగా గెలిచింది. మరోవైపు.. పాకిస్థాన్ సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది.
READ MORE: Nara Lokesh: పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి..
భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో యూఏఈపై 95 బంతుల్లో 171 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే అభిజ్ఞాన్ కుందు కూడా 125 బంతుల్లో 209 పరుగులు చేసి హాట్ టాపిక్‌గా మారాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆరోన్ జార్జ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వరుసగా మూడు అర్ధశతకాలు సాధించి మధ్య ఓవర్లలో జట్టు మంచి రన్‌రేట్ కొనసాగేందుకు సహాయపడ్డాడు. విహాన్ మల్హోత్రా కూడా జార్జ్‌కు మంచి మద్దతుగా నిలిచాడు. సెమీఫైనల్లో 61 పరుగులతో నాట్ అవుట్‌గా నిలిచాడు. మరోవైపు.. బౌలింగ్‌లో పేసర్ దీపేష్ శర్మ మెరిశాడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 11 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. మలేషియాతో మ్యాచ్‌లో 5 వికెట్లు తీసుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాప్ ఆర్డర్‌ను చీల్చి చెండాడుతూ వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టాడు.
READ MORE: Bomma Hit: బొమ్మ హిట్’ అవ్వాలని ఫిక్సయ్యారు!
