India vs Pakistan: భారత్ చేతిలో పాక్ చిత్తు.. పాకిస్థాన్ అభిమానుల మీమ్స్ మామూలుగా లేవు..

Pakisthna

Pakisthna

India vs Pakistan: నిన్న జరిగిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌ని ప్రతి భారతీయుడు తెగ ఎంజాయ్ చేశాడు. ముందు నుంచే పొడిచేస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్ చివరకు చిత్తు చిత్తుగా ఓడింది. మ్యాచ్ ముగిసే సరికి ఒకవైపు భారత్‌లో సంబరాలు ఊపందుకోగా, మరోవైపు పాకిస్థాన్‌ అభిమానుల్లో తీవ్ర నిరాశ, కోపం కనిపించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల భారీ తేడాతో గెలిచి, తమ ఆధిపత్యాన్ని మరోసారి చూపించింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌ల్లో భారత్–పాక్ తలపడిన మ్యాచ్‌లలో భారత్ 8–1తో ముందంజలో ఉంది. ఇది పాకిస్థాన్‌‌కు వరుసగా ఆరో ఓటమి కావడం మరింత బాధ కలిగించింది.

READ MORE: Airaawat: ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు! సోషల్ మీడియాను ఊపేస్తున్న సెన్సేషనల్ బ్యూటీ..

అయితే.. పాకిస్థాన్ ఓటమిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. పాకిస్థాన్‌ అభిమానులు తీవ్ర ఆవేదనతో విరుచుకుపడ్డారు. కొందరు కోపంతో టీవీలు పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఒక యూట్యూబర్ తన సోదరి ముఖంపై కేక్ రాసిన వీడియో వైరల్ అయింది. పాకిస్థాన్ అభిమానుల ఆవేదనలకు సంబంధించిన రియాక్షన్లు మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మ్యాచ్‌కు ముందు కూడా డ్రామా జరిగింది. ఆడబోమని పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు హెచ్చరించింది. కానీ ఆ నిర్ణయం వల్ల ఆర్థికంగా, క్రీడాపరంగా నష్టాలు వస్తాయని తెలిసి చివరికి వెనక్కి తగ్గింది. అలాంటి నేపథ్యం తర్వాత వచ్చిన ఈ భారీ ఓటమి పాకిస్థాన్‌ అభిమానులకు ఇంకా బాధ కలిగించింది. అయితే.. “పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను బ్యాన్ చేసినా బాగుండు” అంటూ పాక్ అభిమానులు చెవులు కరుక్కుంటున్నారట. ఈ మీమ్స్ కి సంబంధించిన వీడియోలు ఇప్పుడు చూద్దాం..