India vs Pakistan: భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025లో ఆరవ మ్యాచ్ దుబాయిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్, పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్ లోని టీం లనే కొనసాగించాయి. దీంతో ఎటువంటి మార్పులు చేయలేదు. భారత జట్టు టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లో యూఏఈ తో గెలవగా, పాకిస్తాన్ ఒమన్ పై ఘన విజయం సాధించింది. దీనితో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆసియా కప్ టీ20లో ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ మధ్య మొత్తం 3 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో భారత్ 2 మ్యాచ్‌లు గెలిచింది. పాకిస్తాన్ 1 మ్యాచ్ విజయం సాధించింది. ఇక నేడు ఆడబోయే జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena: పవన్ కల్యాణ్ ఆదేశం.. మచిలీపట్నం అంతర్గత పరిణామంపై విచారణ షురూ..
భారత జట్టు:
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
CM Chandrababu: టీటీడీ భక్తులకు గుడ్‌స్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. 13 ఎకరాల విస్తీర్ణంలో…
పాకిస్తాన్ జట్టు:
సాహిబ్జదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖార్ జమాన్, సల్మాన్ అఘ (కెప్టెన్), హసన్ నవాజ్, మొహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, ఫాహీం అశ్రఫ్, షాహీన్ షా ఆఫ్రిది, సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్
