NTV Telugu Site icon

India vs New Zealand: తిప్పేసిన స్పిన్నర్లు.. న్యూజిలాండ్ 235 ఆలౌట్

India Vs New Zealand

India Vs New Zealand

India vs New Zealand: ముంబై నగరంలో జరుగుతున్న భారత్‌, న్యూజిలాండ్‌ టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యింది. టీం ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో మొదటిరోజు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. న్యూజిలాండ్ బ్యాటర్లను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. ఏకంగా తొమ్మిది వికెట్లను స్పిన్నర్లు తీశారు. ఇందులో జడేజా ఐదు వికెట్స్ పడగొట్టగా.. మరో స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే ఆకాశ్‌ దీప్‌ కూడా ఒక వికెట్‌ పడగొట్టాడు.

Also Read: RBI Repo Rate: రెపో రేటును 25 పాయింట్లు తగ్గించనున్న ఆర్‌బీఐ?

ఇక మరోవైపు న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో డారిల్‌ మిచెల్‌ 82, విల్‌ యంగ్‌ 71, టామ్‌ లాథమ్‌ 28 , గ్లెన్‌ ఫిలిప్స్‌ 17 పరుగులతో రాణించగా.. మిగితావారు విఫలమయ్యారు. 3 టెస్టుల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్‌ జట్టు ఇప్పటి 2 – 0 తో సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దింతో చివరి టెస్ట్ లోనైనా విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. చూడలి మరి టీమిండియా క్లీన్ స్వీప్ నుండి తప్పించుకుంటుందో లేదో.

Show comments